- కురుమ సంఘం ప్యానల్ 2 సభ్యులు.
తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ప్యానల్ 2 రాష్ట్ర కార్యవర్గ సభ్యులపై ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య క్యామ మల్లేశం వారి కార్యవర్గ సభ్యులు బురదజల్లే విధంగా ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలు, కోకాపేట దొడ్డి కొమరయ్య ఆత్మగౌరవ భవనం ప్రైవేట్ పరం కాలేదు అని ఏ సంస్థకు లీజుకు ఇవ్వలేదని అన్న మాటలు అన్ని అవాస్తవాలేనని కురుమ సంఘం ప్యానల్ 2 సభ్యులు దొడ్డి శ్రీనాథ్ కురుమ, కరికే సత్యనారాయణ, మాదారం కృష్ణ అన్నారు.
శుక్రవారం రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం ప్యానెల్ 2 తోనే తమ కార్యక్రమాలను కొనసాగిస్తామని, కురుమ సంఘం లో ఎందరో ఎన్నో సంవత్సరాలుగా సేవలందిస్తున్నప్పటికీ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు ట్రస్ట్ మెంబర్గా ఎన్నుకోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిర్లా ఐలయ్య ఎమ్మెల్యే కాకముందు ఎగ్గే మల్లేశంపై ఎన్నో వ్యాఖ్యలు చేశాడని, తన తప్పులన్నీ బయట పెట్టడని వారు తెలిపారు.

ఎమ్మెల్యేగా గెలిచాక డబ్బు ఉండడంతో ఎగ్గే మల్లేశం చుట్టే తిరుగుతూ తను చెప్పిన మాటలు నమ్మి కురుమ సంఘం సభ్యులను మోసం చేస్తున్నాడని అన్నారు. ప్యానల్ 2 తరపున రంగారెడ్డి జిల్లా కురుమ యువత సంఘం అధ్యక్షులుగా కుండే రాజేష్, ప్రధాన కార్యదర్శి శివానంద్ కవేతి, ఉపాధ్యక్షులుగా శంకర్ వల్ల శంకర్ రిత్విక్ భార్గవ్ కోశాధికారి భోజన రవి లను ఎన్నుకొన్నారు. ఈ కార్యక్రమంలో ప్యానెల్ 2 నాయకులు చిలంపల్లి సురేష్, అడిగే సంతోష్, కరికే సాయి, రమేష్, కర్రి వెంకటయ్య, అయిలేష్, పోచయ్య, నరసింహ, యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.
