Tuesday, April 14, 2026
HomeజాతీయంProtest | నోయిడాలో కార్మికుల నిరసన..

Protest | నోయిడాలో కార్మికుల నిరసన..

  • హింసాతకంగా మారిన పరిస్థితులు..
  • దీని వెనుక పాకిస్తాన్ ఉందని అనుమానం..

వేతనాల పెంపు కోరుతూ ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడాలో కార్మికులు చేపట్టిన నిరసనలు సోమవారం హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఘటనల వెనుక భారీ కుట్ర, ప్లానింగ్ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేకాదు.. దీని వెనుక పాకిస్తాన్ హస్తం కూడా ఉండొచ్చనే కోణంలో విచారణ జరుపుతున్నారు. కార్మికుల ఆందోళనలు హింసాత్మకంగా మారడం వెనుకు పాకిస్తాన్ కుట్ర ఉండొచ్చని యూపీ కార్మిక శాఖ మంత్రి అనిల్ రాజ్‌బహర్ అన్నారు.

ఈ ఘటనల్ని ప్రణాళికాబద్దంగా జరిగిన కుట్రగా ఆయన అభివర్ణించారు. ఈ విషయాన్ని పోలీసులు తేలుస్తారని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించేందుకే ఈ ఘటనలు జరిగాయని అనుమానం వ్యక్తం చేశారు. ఇటీవల నోయిడాలోని మీరట్ ప్రాంతంలో నలుగురు ఉగ్రవాదులు అరెస్టైన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.

- Advertisement -

ఈ విచారణలో సంచలన విషయాలు బయటపడుతున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ హింస వెనుక భారీ కుట్ర, ప్లానింగ్ ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధరించారు. ముందుగా కొందరు కార్మికులు వారం రోజుల క్రితం.. ఫ్యాక్టరీల్లో వేతనాల పెంపు కోరుతూ నిరసన చేపట్టారు. తర్వాత ఈ నిరసనలు వీధుల్లోకి మారాయి. వేల మంది కార్మికులు నిరసనల్లో చేరారు. తర్వాత మరింత ఆందోళనకరంగా మారాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News