Homeస్పోర్ట్స్Sanju Samson | సంజూ సాంసన్ కు అరుదైన గుర్తింపు..

Sanju Samson | సంజూ సాంసన్ కు అరుదైన గుర్తింపు..

  • ఐసీసి నుంచి తగిన గుర్తింపు..
  • ప్లేయర్ ఆఫ్ మంత్ అవార్డుకు ఎంపిక..

పొట్టి వరల్డ్‌కప్‌లో పిడుగుల్లే విరుచుకపడిన సంజూ శాంసన్‌ కు తగిన గుర్తింపు దక్కింది. సంచలన ఇన్నింగ్స్‌లతో భారత్‌ మూడోసారి టీ20 ప్రపంచకప్ గెలవడంలో కీలకమైన సంజూకు ఐసీసీ అవార్డు లభించింది. స్వదేశంలో జరిగిన టోర్నీలో హ్యాట్రిక్ అర్ధ శతకాలతో భారత్‌ను విజేతగా నిలిపిన సంజూ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డుకు ఎంపికయ్యాడు. మార్చి నెలకు ఐసీసీ జరిపిన ఓటింగ్‌లో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాను వెనక్కి నెట్టేసి శాంసన్‌ ఈ గౌరవాన్ని అందుకున్నాడు.

మహిళల విభాగంలో అమేలియా కేర్ అవార్డును ఎగరేసుకుపోయింది. భారత్, శ్రీలంక వేదికగా జరిగిన పొట్టి ప్రపంచకప్‌లో చిరస్మరణీయ ఆట ఆడిన సంజూ శాంసన్‌ను ఐసీసీ అవార్డు వరించింది. క్వార్టర్ ఫైనల్ లాంటి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై 97.. ఆపై ఇంగ్లండ్‌ మీద 89, ఫైనల్లో న్యూజిలాండ్‌పై అర్ధ శతకంతో రెచ్చిపోయిన సంజూ.. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుపొందాడు. తనకు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు రావడం పట్ల శాంసన్ సంతోషం వ్యక్తం చేశాడు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News