Tuesday, April 14, 2026
Homeఅంతర్జాతీయంPakistan | పాకిస్తాన్ డొల్ల వ్యవహారం..

Pakistan | పాకిస్తాన్ డొల్ల వ్యవహారం..

  • శాంతి చర్చలు జరిగిన హోటల్ బిల్లు చెల్లించలేక చతికిల..
  • ఆతిథ్య ఖర్చులు భరించాల్సిన బాధ్యత పాక్ దే..

ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలకు వేదికగా నిలిచి, ప్రపంచం ముందు గొప్పలు పోతున్న పాకిస్తాన్ అసలు వ్యవహారం ఇప్పుడు బయటపడింది. రెండు దేశాల మధ్య చర్చలకు వేదికైన ఇస్లామాబాద్‌లోని హోటల్ బిల్లు కూడా చెల్లించలేక ప్రపంచం ముందు అవమానం పాలైంది. ఇరాన్-అమెరికా మధ్య పాకిస్తాన్ వేదికగా ఇటీవల శాంతి చర్చలు జరిగాయి. ఏప్రిల్ 10-12 వరకు ఇస్లామాబాద్‌లోని హోటల్ సెరెనా వేదికగా శాంతి చర్చలు జరిగాయి. దీనికి ఇరు దేశాలకు చెందిన అగ్రనేతలు హాజరయ్యారు. వీరికి పాక్ ప్రభుత్వం ఆతిథ్యం ఇచ్చింది. అంటే, ఇక్కడి ఆతిథ్య ఖర్చుల్ని పాక్ భరించాలి.

ఇక.. ఈ చర్చలు విఫలమైన సంగతి కూడా తెలిసిందే. ఈ చర్చలు నిర్వహించడం ద్వారా ప్రపంచం ముందు తాము ఈ ప్రాంతంలో మధ్యవర్తిత్వం వహించగల సత్తా ఉన్న దేశంగా చాటింపు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా పాకిస్తాన్‌ను పొగిడాడు. పాక్ ప్రధాని షెహబాజ్, సైన్యాధ్యక్షుడు అసిమ్ మునీర్‌పై ప్రశంసలు కురిపించారు. ఇంతఖ్యాతి పొందిన పాకిస్తాన్ ఇప్పుడు ఇదే విషయంలో ప్రపంచం ముందు అభాసుపాలైంది. ఆతిథ్యం ఇచ్చిన హోటల్ బిల్లుల్ని కూడా పాక్ ప్రభుత్వం చెల్లించలేకపోయింది. హోటల్ బిల్లు చెల్లించాలని, హోటల్ యాజమాన్య సంస్థ అయిన అగా ఖాన్ డెవలప్‌మెంట్ నెట్‌వర్క్ సంస్థ డిమాండ్ చేస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News