- సికింద్రాబాద్ కార్పొరేటర్లు
సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ సహకారంతో సీతాఫలమండి,బౌద్ధనగర్,మెట్టుగూడ డివిజన్లలో విజయవంతంగా కార్పొరేటర్లుగా సేవలందించిన డాక్టర్ సామల హేమ,కంది శైలజ,సునీత తమ పదవీకాలం పూర్తి అయిన సందర్భంగా బుధవారం నాడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…
అయిదేళ్లపాటు ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశాన్ని కల్పించిన తమ నాయకుడు పద్మారావు గౌడ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.ఆయన తమపై ఉంచిన నమ్మకం,చూపిన ఆదరణ,ఇచ్చిన ప్రోత్సాహం వల్లే ప్రజాసేవలో ఈ స్థాయిలో ముందుకు సాగగలిగామని పేర్కొన్నారు.ప్రతి క్షణం ప్రజల కోసం ఎలా పనిచేయాలి,సమస్యల పరిష్కారంలో ఎలా ముందుండాలి అనే విషయాల్లో మార్గనిర్దేశం చేసిన గురువు తమ ఎమ్మెల్యే అని అభివర్ణించారు.
ప్రజల నమ్మకం మా నాయకుడి ఆశీస్సులు మా ఆత్మవిశ్వాసం ఈ మూడు కలిసి తమ ప్రజాసేవ ప్రయాణాన్ని విజయవంతం చేశాయని తెలిపారు.తమ నాయకుడికి జీవితాంతం రుణపడి ఉంటామని స్పష్టం చేశారు.
