టీమిండియా(Team India) టీ20 టీమ్(T20 Team)కి భీమిలి ఎమ్మెల్యే(Bhimili Mla) గంటా శ్రీనివాసరావు బుధవారం సింహాచలం(Simhachalam) నృసింహ స్వామి వారి ఆలయ ధ్వజస్తంభం వద్ద స్వాగతం పలికారు. వారితో కలిసి దైవ దర్శనం చేసుకున్నారు. అర్చకులు ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వచనం అందించారు. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా.. ఇవాళ విశాఖలో జరిగే 4వ మ్యాచ్‌లోనూ ఘన విజయం సాధించాలని ఘంటా శ్రీనివాసరావు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీమిండియా టీ20 టీమ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హెడ్ కోచ్ గౌతం గంభీర్, ఆటగాళ్లు అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, ఫీల్డింగ్ కోచ్ దిలీప్, టీమిండియా మాజీ మేనేజర్ పి.వి.ఆర్.ప్రశాంత్ తదితరులు ఉన్నారు.
- Advertisement -
