Homeస్పోర్ట్స్Arrest | అత్యాచారం కేసులో ఐపీఎల్ స్టార్..

Arrest | అత్యాచారం కేసులో ఐపీఎల్ స్టార్..

  • వైద్య విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసుల స్పందన..
  • పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసిన బ్యాటర్..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ స్టార్ అభిషేక్ పొరెల్ అరెస్ట‌య్యాడు. అత్యాచారం కేసులో అత‌డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ వైద్య విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు అభిషేక్‌పై క్రిమిన‌ల్ కేసు పెట్టిన పోలీసులు మంగ‌ళ‌వారం అరెస్ట్ చేశారు. పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించి త‌న‌ను లైంగికంగా లొంగ‌దీసుకున్నాడ‌ని స‌ద‌రు విద్యార్థిని అత‌డిపై తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేసింది. ఐపీఎల్‌లో మెరుస్తున్న మ‌రో క్రికెట‌ర్ అత్యాచారం కేసులో అరెస్ట‌య్యాడు.

ఇప్ప‌టికే య‌శ్ ద‌యాల్ రేప్ కేసులో ఇరుక్కోగా.. బెంగాల్ క్రికెట‌రైన అభిషేక్ పొరెల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు ప్రాతినిధ్యం వ‌హించే అభిషేక్ త‌న‌పై అత్యాచారం చేశాడ‌ని, భ‌య‌పెట్టాడ‌ని ఓ వైద్య విద్యార్థిని ఫిర్యాదు చేయ‌డ‌మే అందుకు కార‌ణం. స‌ద‌రు విద్యార్థిని ఫిర్యాదు మేరకు డుమ్ డుమ్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని ఎమామి సిటీ పోలీసులు అభిషేక్‌ను అరెస్ట్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News