Friday, February 13, 2026
Homeహైదరాబాద్‌Kavitha | ‘మేఘా’ను రక్షించేందుకే బీఆర్ఎస్ ప్రయత్నం

Kavitha | ‘మేఘా’ను రక్షించేందుకే బీఆర్ఎస్ ప్రయత్నం

హరీష్‌రావు, కేటీఆర్‌లపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలి విమర్శలు
బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ప్రెస్‌మీట్
సింగరేణి కాంట్రాక్ట్‌ల అంశంపై భిన్నమైన స్పందన

సింగరేణి కాంట్రాక్ట్‌ల(Singareni Contracts)కు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న వివాదంపై తెలంగాణ జాగృతి (Telangana Jagruti) అధ్యక్షురాలు కవిత(President Kavitha) స్పందించారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆదివారం ప్రెస్‌మీట్ పెట్టి పలు అంశాలను వెల్లడించారు. మేఘా(Megha) అనే తిమింగలాన్ని రక్షించేందుకే బీఆర్ఎస్ పార్టీ(BRS Party) చిన్న చేప చుట్టూ టెండర్ల వ్యవహారాన్ని తిప్పుతోందని విమర్శించారు. సింగరేణి కాంట్రాక్ట్‌ల విషయంలో సృజన్ రెడ్డి చిన్న చేప అని కవిత అన్నారు. మేఘా కృష్ణారెడ్డికి రూ.25 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. దాని మీద బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు.

- Advertisement -

కవిత ఇంకా ఏమన్నారంటే..

‘కార్మికులకు కష్టం వస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ పట్టించుకోవటం లేదు. పెద్ద కాంట్రాక్టర్‌ను కాపాడేందుకు గుంటనక్క ప్రయత్నం చేస్తోంది. సింగరేణి విషయంలో బీఆర్ఎస్ తప్పులే చేయనట్లు మాట్లాడటం విచిత్రంగా ఉంది. గుంటనక్క ప్రెస్ మీట్‌ను గుడ్డిగా ఫాలో అయి కేటీఆర్ గుంతలో పడ్డాడు. గతంలో సృజన్ రెడ్డికి బీఆర్ఎస్ హయాంలోనే కాంట్రాక్ట్‌లు ఇచ్చారు. అప్పుడు రేవంత్ రెడ్డి బావమరది అని గుర్తుకు రాలేదా?. సింగరేణి విషయంలో బీఆర్ఎస్ డొల్లతనాన్ని మేం గమనిస్తున్నాం. కేటీఆర్‌పై కథనం వస్తే ఒక నీతి? దళిత మహిళపై కథనం వస్తే ఒక నీతా?.

కాంగ్రెస్ ఓ లూజర్ పార్టీ. వచ్చే ఎన్నికల్లో గెలిచేది జాగృతి పార్టీయే. నేను కాంగ్రెస్‌లోకి వెళ్తానని నా వ్యక్తిత్వాన్ని బద్నాం చేస్తున్నారు. మహేష్ గౌడ్‌నే జాగృతిలోకి ఆహ్వానిస్తున్నాం. ఆయనొస్తే నేషననల్ కన్వీనర్ పోస్ట్ ఇస్తాం. ఫోన్ ట్యాపింగ్ విచారణను జోక్‌గా మార్చారు. నా లాంటి బాధితులకు న్యాయం జరగుతుందని నమ్మకం లేదు. మన రాష్ట్రంలో ఇప్పుడు దారుణమైన ట్రెండ్ స్టార్ట్ అయింది. మోస్ట్ అన్ పాపులర్ యూట్యూబ్ ఛానెల్‌లో కథనాలు వేసినట్లు శాటిలైట్ ఛానెల్‌లో కూడా స్టోరీలు వేస్తున్నారు. దళిత ఆడబిడ్డల మీద అలాంటి కథనాలు వేయటంతో ఎంతో బాధపడ్డాం.

గతంలో లైన్ అతిక్రమించిన యూట్యూబ్ ఛానెల్ వాళ్లను బీఆర్ఎస్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి లైన్ అతిక్రమించిన శాటిలైట్ ఛానెల్ ప్రతినిధులను కూడా అరెస్ట్ చేసింది. ఐతే జర్నలిస్టులను అరెస్ట్ చేసిన తీరును మేం ఖండిస్తున్నాం. వాళ్లేమీ టెర్రరిస్టులు కాదు. వాళ్లకు నోటీసులు ఇచ్చి వివరణ అడగాల్సింది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని బీఆర్ఎస్ పార్టీ జర్నలిస్టులకు సపోర్ట్‌గా నిలిచింది. కానీ.. కేటీఆర్ గారి మీద ఇలాంటే కథనాలే వస్తే ఆయన అనుచరులు ఒక ఛానెల్‌పై దాడి చేశారు.

అక్కడ మహిళపై కథనాలు వేస్తే దాడి. ఇక్కడ మహిళలపై కథనాలు వస్తే జర్నలిస్టులకు సపోర్ట్ చేస్తారా? మహిళల విషయంలో ఇదేనా మీ వైఖరి అని నేను కేటీఆర్‌ని ప్రశ్నిస్తున్నా. ఒక దళిత బిడ్డపై కథనాలు వస్తే ఆమెకు అండగా ఉండకపోవటాన్ని ప్రజలు గుర్తించాలి. ఆ ఛానెల్‌లో కథనం తర్వాత ఆ కథనం బ్యాక్ గ్రౌండ్ అంటూ ఇంకొక పేపర్‌లో స్టోరీ వచ్చింది. ఆ కథనం ఆధారంగా భట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టారు. భట్టి ప్రెస్ మీట్ పెట్టగానే మా గుంటనక్క కూడా ప్రెస్ మీట్ పెట్టారు. గుంటనక్క ప్రెస్ మీట్‌ను గుడ్డిగా ఫాలో అయి కేటీఆర్ ఒక ప్రెస్ మీట్ పెట్టారు.

మొత్తానికి నైనీ కాంట్రాక్ట్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇక్కడ విచిత్రాలు జరగుతున్నాయి. మేం కాంట్రాక్టర్ల పక్షాన కాకుండా కార్మికుల పక్షాన మాట్లాడతాం. రెండేళ్లుగా మేం కార్మికుల సమస్యల గురించి ఎన్నిసార్లు మాట్లాడినా.. భట్టి మాత్రం మాట్లాడలేదు. కార్మికులకు వంద అన్యాయాలు జరిగినా సరే బీఆర్ఎస్ కూడా మాట్లాడలేదు. కానీ.. ఒక తిమింగళం లాంటి కాంట్రాక్టర్‌కు అన్యాయం జరిగితే ముందుకు వస్తున్నారు. నైనీ బ్లాక్‌.. ముందుగా 2015లో మనకే ఆలాట్ అయింది. 2021లో అదానీ 44 శాతం ఎక్సెస్‌గా టెండర్ వేసినా ఆయనకు కాంట్రాక్ట్ ఇవ్వలేదు.

మధ్యలో సింగరేణి వేరే కంపెనీవాళ్లకు మట్టి తీసే టెండర్ ఇచ్చింది. దానికి డిజీల్ ఖర్చులతో సహా ఇచ్చారు. కానీ గుంటనక్క అబద్దం చెప్పారు. కేటీఆర్ ఏ విషయమైనా అధ్యయనం చేసి మాట్లాడతారని అనుకునేదాన్ని. కానీ ఆయన మాట్లాడుతుంటే దారుణం అనిపించింది. అసలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్సెస్ టెండర్లు ఇవ్వలేదని అన్నారు. కానీ.. చాలా టెండర్లను ఎక్సెస్‌కు ఇచ్చారు. 36, 16, 7, 8 శాతం ఎక్సెస్‌కు ఇచ్చారు. సైట్ విజిట్ అనే నిబంధన సింగరేణిలో గతంలో కన్వెయర్ బెల్ట్ లాంటి వాటికి ఉండేది. ఇప్పుడు ఓబీకి కూడా సైట్ విజిట్ పెట్టారు. దీన్ని ఎక్స్‌పోజ్ చేయటం మంచిదే.

కానీ.. బీఆర్ఎస్ హయాంలో అసలు ఎక్సెస్‌గా టెండర్లు పోలేదని అబద్దాలు చెప్పటం సరికాదు. గుంటనక్క, నమస్తే తెలంగాణ, టీ న్యూస్, కేటీఆర్ కలిసి చిన్న చేపను పెద్దగా చూపి పెద్ద చేపను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. సృజన్ రెడ్డి అనే వ్యక్తికి వచ్చింది కేవలం రూ.250 కోట్ల కాంట్రాక్ట్ మాత్రమే. అతను సీఎం బావమరిది అని ఆయనను పెద్దగా చేసి చూపెట్టి 25 వేల కోట్ల కాంట్రాక్ట్ చేపట్టే మేఘా కృష్ణారెడ్డి గురించి మాట్లాడటం లేదు. అసలు సృజన్ రెడ్డికి కాంట్రాక్ట్‌లు ఇచ్చిందే గుంటనక్క. అప్పుడు సీఎం బావమరిది అని వీళ్లకు తెలియదా?. సైట్ విజట్ నిబంధన కారణంగా కొంత మందికి అవకాశాలు దెబ్బతింటాయి.

కానీ.. గుంటనక్క చెప్పని విషయమేమిటంటే సాయిల్ ఎక్స్‌కవేషన్ పేరుతో మేఘా కృష్ణారెడ్డి సంస్థ అనుభవం ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా రూ. 25 వేల కోట్ల కాంట్రాక్ట్‌ను పెద్ద చేపకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. హరీష్ రావు మొత్తం దళిత కమ్యూనిటీనే అవమానపరిచేలా భట్టి విక్రమార్కకు లేఖ రాయను అంటున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మాత్రమే ఆయన లెటర్ రాస్తారంట. అసలు సింగరేణిలో ఎండీవో అనే సిస్టమ్ ఉండకూడదు. గతంలో సింగరేణికి ఓపెన్ కాస్ట్‌లతో ఎంతో లాభం ఉండేది. కానీ ఎండీవో సిస్టమ్ తెచ్చి సంస్థకు నష్టం చేస్తున్నారు.

దీంతో.. అసలే నష్టాల్లో ఉన్న సింగరేణి మరింత నష్టపోతోంది. బీఆర్ఎస్ హయాంలోనే సింగరేణికి రూ.25 వేల కోట్ల అప్పు పెట్టారు. కాంగ్రెస్ వచ్చాక రూ. 50 వేల కోట్లు అయ్యింది. పవర్ సంస్థల నుంచి రావాల్సిన బకాయిలు ఇవ్వటం లేదు. దీంతో.. సింగరేణి సంస్థ జీతాల కోసం కూడా అప్పు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. నైనీ టెండర్లు రద్దు చేసినట్లే ఎండీవో విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నా. మనం కూడా నైనీ బ్లాక్ ఉన్న ఒరిస్సాకు వెళ్లి ఓపెన్ కాస్ట్ చేయాలి. దాని ద్వారా తెలంగాణ కార్మికులకు ఉద్యోగాలు వస్తాయి. సంస్థకు మేలు జరుగుతుంది.

ఎంతో క్వాలిటీ ఉన్న తాడిచర్ల బ్లాక్‌ను కూడా ఎండీవో విధానం ద్వారా ఇచ్చారు. దీంతో సంస్థకు లీజు మాత్రమే వస్తుంది. గ్రేడ్ 9 క్వాలిటీ ఉన్న కోల్‌ను పెద్ద చేప కోసం కాంట్రాక్ట్ ఇస్తున్నారు. సింగరేణి విషయంలో బీఆర్ఎస్ చేస్తున్న డొల్ల విధానాన్ని మేం గమనిస్తున్నాం. బీఆర్ఎస్ అబద్దాలు చెప్పకుండా ప్రజలకు అన్ని వాస్తవాలే చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. అసలు రాష్ట్ర ప్రభుత్వం కోరకుండా సీబీఐ వస్తుందా?.. కానీ గుంటనక్క మాత్రం భట్టికి లేఖ రాయకుండా కిషన్ రెడ్డికి లేఖ రాస్తారంట. గుంటనక్క అడగ్గానే కిషన్ రెడ్డి ఏదో పేరుతో కమిటీ వేశారు.

అందులో ఏజీఎం ర్యాంక్ ఉన్న మారుపల్లి వెంకటేష్ అనే అధికారి ఉన్నాడు. ఆయన సింగరేణి ఎండీని ప్రశ్నించి ఆయనకు వ్యతిరేకంగా రిపోర్ట్ ఇవ్వగలడా? అసలు ఏపీలో, తెలంగాణలో ఉన్న కొత్త బ్లాక్‌లను సింగరేణికే ఇవ్వాలి. కిషన్ రెడ్డి ఈ బ్లాక్‌ను సింగరేణికి వచ్చేలా కృషి చేయాలి. రూల్స్ అనకుండా మనకు వచ్చేందుకు ఆయన తరఫున ప్రయత్నం చేయాలి. గతంలో గుజరాత్‌కు బొగ్గు బ్లాక్‌లను తీసుకొని పోయిన ఘటనలు లేవా? కిషన్ రెడ్డి తెలంగాణ కోసం చేయకపోతే బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇచ్చి ఏం లాభం?

త్వరలోనే సింగరేణిలో ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికైనా కార్మికుల డిమాండ్లను పరిష్కరించే ప్రయత్నం చేయాలి. కార్మికుల రిక్రూట్‌మెంట్లు, బిల్లులు వచ్చేలా చేయాలి. మాకు మైనార్టీ వాటా ఉందంటూ ఏమీ చేయలేమని కిషన్ రెడ్డి చెప్పటం కరెక్ట్ కాదు. జాగృతి తరఫున నైనీ బ్లాక్‌ను విజిట్ చేసేందుకు ప్రత్యేక డెలిగేషన్ వెళ్తుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఎవరైనా కార్మికుల పక్షాన ఉండాలి. కానీ కాంట్రాక్టర్ల కోసం పనిచేస్తున్నారు. జాగృతి మాత్రం ఎప్పటికీ కార్మికుల పక్షానే ఉంటుంది. వారి కోసం పనిచేస్తుంది. నైనీ బ్లాక్ విషయంలో నేను మాట్లాడితే టీవీ9 లో నా స్టోరీ వేయరు.

అయినా సరే సింగరేణికి రూ. 25 వేల కోట్ల నష్టం వస్తుంది కనక నేను మాట్లాడుతున్నాను. సింగరేణిలో కాంగ్రెస్ వాటాలు తేలలేదని గుంటనక్క అంటున్నారు. కానీ అసలు గుంటనక్క వాటాలు తేలకపోవటంతోనే అలా మాట్లాడుతున్నారు. పైగా ఆయన 2014 నుంచి విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంపైనే విచారణ చేయమని అడుగుతున్నారు. పాపం కేటీఆర్ కూడా అదే ట్రాప్‌లో పడి అదే విధంగా డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్‌లోనే ఉంటూ కేసీఆర్‌కి గుంటనక్క ద్రోహం చేస్తోంది. గుంటనక్కను ఫాలో అయి గుడ్డిగా కేటీఆర్ గుంటలో పడ్డాడు.

ఏ ఛానెల్‌ను బ్యాన్ చేయటమేంటో కానీ త్వరలోనే ప్రజలు బీఆర్ఎస్‌ను బ్యాన్ చేస్తారు. నేను కాంగ్రెస్‌కు వస్తానంటే మహేష్ కుమార్ గౌడ్ వద్దన్నానంటూ చెబుతున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో లూజింగ్ పార్టీ. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలిచే పార్టీ జాగృతి పార్టీ. మా పార్టీ కోసం మేం ధూంధాంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాం. మహేష్ గౌడ్‌కి ఉన్న ఎక్స్‌పిరీయన్స్ కారణంగా ఆయనకి మేం నేషనల్ కన్వీనర్ పదవి ఇస్తాం. నేను కాంగ్రెస్‌లోకి వస్తానని ఆయనకు కల వచ్చిందేమో. ఏదైనా బొట్టు పెట్టించుకొని ఎవరికైనా చూపించుకోవాలి. నా వ్యక్తిత్వాన్ని బద్నాం చేసేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు.

మేం చాలా సీరియస్‌గా ప్రజల కోసం పనిచేసే పొలిటికల్ పార్టీగా వస్తున్నాం. నేషనల్ కన్వీనర్ పోస్ట్ ఇస్తాం. మేం సీరియస్ పొలిటికల్ పార్టీగా వస్తాం. ఫోన్ ట్యాపింగ్ జోక్ అయిపోయింది. రెండేళ్లుగా సీరియల్‌గా సాగదీస్తున్నారు. నా లాంటి బాధితులకు మేలు చేయటం లేదు. ఫోన్ ట్యాపింగ్ చేసినవారికి నోటీసులు ఇస్తున్నారా? బాధితులకు నోటీసులు ఇస్తున్నారా? అర్థం కావటం లేదు. మునిసిపల్ ఎన్నికల కోసమే ప్రభుత్వం ఈ డ్రామా చేస్తోంది. టెర్రరిస్టుల కోసం చేయాల్సిన ఫోన్ ట్యాపింగ్‌ను అన్ని ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తున్నాయి’ అని కవిత తప్పుపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News