Wednesday, February 11, 2026
Homeహైదరాబాద్‌Investment | హైదరాబాద్‌లో రూ.5000 కోట్ల పెట్టుబడి

Investment | హైదరాబాద్‌లో రూ.5000 కోట్ల పెట్టుబడి

నెదర్లాండ్స్‌ సంస్థతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం

హైదరాబాద్‌(Hyderabad)ను దేశంలోనే ఏఐ డేటా సెంటర్ హబ్‌(Data Center Hub)గా తీర్చిదిద్దాలన్న లక్ష్య సాధనలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక పెట్టుబడిని సాధించింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్‌లో యూపీసీ–వోల్ట్ సంయుక్త భాగస్వామ సంస్థ(UPC–Volt joint venture)తో అవగాహన ఒప్పందం(MoU) చేసుకుంది.
✳️ నెదర్లాండ్స్‌(Netherlands)కు చెందిన యూపీసీ రిన్యూవబుల్స్ గ్రూప్, వోల్ట్ డేటా సెంటర్స్‌ల సంయుక్త భాగస్వామ్యంలో రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో 100 మెగావాట్ల సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్‌ నెలకొల్పుతుంది.
✳️ సీఎం నేతృత్వంలోని ప్రతినిధి బృందం వోల్ట్ సీఈవో హాన్ డీ గ్రూట్, యూపీసీ రిన్యూవబుల్స్(ఆసియా పసిఫిక్) సహవ్యవస్థాపకుడు స్టీవెన్ జ్వాన్, యూపీసీ రిన్యూవబుల్స్ ఇండియా సీఈవో అలోక్ నిగమ్‌తో సమావేశమైంది.
✳️ ఈ ప్రాజెక్టుకు.. వచ్చే ఐదేళ్లలో రూ. 5,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ డేటా సెంటర్‌కు అవసరమైన విద్యుత్‌ సరఫరాకు 100 మెగావాట్ల సామర్థ్యంతో ప్రత్యేక పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుచేయనుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ దశలో దాదాపు 3,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. డేటా సెంటర్ ప్రారంభమైన తర్వాత మరో 800 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి.
✳️ పెట్టుబడుల సాధనలో మంత్రి శ్రీధర్ బాబును ఈ సందర్భంగా సీఎం రేవంత్ అభినందిస్తూ.. తెలంగాణ రైజింగ్ 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తెలంగాణను తీర్చిదిద్దడంలో ఆధునిక డిజిటల్ మౌలిక వసతులు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.
✳️ మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ.. అధునాతన ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన ప్రోత్సాహకాలు, సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. నెట్ జీరో సిటీ అభివృద్ధే తెలంగాణ విజన్‌లో భాగమని అన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డితోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News