Friday, April 10, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | అధికార పీఠం ఏ ఒక్కరికీ శాశ్వతం కాదు

Aaj Ki Baath | అధికార పీఠం ఏ ఒక్కరికీ శాశ్వతం కాదు

మన రాష్ట్రంలో అధికార-ప్రతిపక్షాలు మాట్లాడుతున్న భాష రాజకీయ అనైతికతకు అద్దం పడుతోంది.అధికార పీఠం ఏ ఒక్కరికీ శాశ్వతం కాదు. ప్రజల మనసు దోచుకున్నప్పుడే పీఠం దక్కుతుంది.కాబట్టి మీరు పోటీ పడాల్సింది మీకు ఓట్లు వేసిన ప్రజల బాగోగుల కోసం. వారి కష్టనష్టాలను తీర్చడం కోసం.అంతేతప్ప మీ వ్యక్తిగత విమర్శలు ఎవరికీ అవసరం లేదు!రాష్ట్రం ఎదుర్కొంటున్న అప్పులు, ప్రజల సమస్యల పరిష్కారానికి విధానపరమైన సూచనలు, సలహాలు ఇస్తూ,వాటిని అమలు చేస్తూ ప్రజల ఆదరణ పొందండి. ప్రజాస్వామ్యంలో ప్రజాతీర్పును గౌరవించడం ముఖ్యం . ఇకనైనా దురుసు మాటలు తగ్గించి హుందాగా నడుచుకోండి. సమస్యలను పరిష్కరించడంలో పార్టీల,నాయకుల ప్రవర్తనను ప్రజలు అనునిత్యం గమనిస్తుంటారు.అవకాశం వచ్చినప్పుడు ఓటు అనే వజ్రాయుధంతో వేటు వేస్తారన్న విషయాన్ని విస్మరించకండి.

  • మేదాజీ

- Advertisement -
RELATED ARTICLES

Latest News