Wednesday, June 3, 2026
HomeజాతీయంTVK | విజయ్ సంచలన నిర్ణయం

TVK | విజయ్ సంచలన నిర్ణయం

  • స్వతంత్ర అభ్యర్ధికి మద్దతు..
  • టీవీకే అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ సేలం జిల్లా లోని ఎడప్పాడి నియోజకవర్గంలో అనూహ్య రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం పార్టీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది.దాంతో ఒక స్వతంత్ర అభ్యర్థికి టీవీకే మద్దతు ప్రకటించింది. టీవీకే చీఫ్‌ విజయ్‌ తీసుకున్న ఈ నిర్ణయం ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తించింది.

ఎడప్పాడి నుంచి టీవీకే తరఫున దాఖలైన నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. దాంతో అక్కడి పార్టీ శ్రేణులు నిరాశకు గురయ్యాయి. ఈ తరుణంలో అధ్యక్షుడు విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇదే నియోజకవర్గంలో స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రేమ కుమార్‌కు పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. ప్రేమకుమార్ తన చిరకాల మిత్రుడని, గతంలో తన అభిమాన సంఘం నిర్వాహకుడిగా పనిచేశాడని, సోదర సమానుడని విజయ్ తన పోస్టులో పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News