HomeజాతీయంSharad Pawar Hospitalized | ఆసుపత్రికి శరత్ పవార్..

Sharad Pawar Hospitalized | ఆసుపత్రికి శరత్ పవార్..

  • తలెత్తిన డీ హైడ్రేషన్ సమస్య..Sharad Pawar Hospitalized
  • ఆరోగ్యం నిలకడగానే ఉందన్న కుటుంబ సభ్యులు..

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ (85) అస్వస్థతకు గురయ్యారు. డీహైడ్రేషన్ సమస్య తలెత్తడంతో ఆయనను ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.Sharad Pawar Hospitalized

ఈ విషయాన్ని ఆయన కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా పంచుకున్నారు. “మేము బాబాను బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరుస్తున్నాం. ఆయనకు డీహైడ్రేషన్ సమస్య ఉన్నట్లు కనిపిస్తోంది. ఆయన ప్రయాణాలు తగ్గించుకుని విశ్రాంతి తీసుకోవాలి, కానీ బాబా మా మాట అస్సలు వినరు. ఆయనకు పని అంటే ఎంతో ప్రాణం. మీ అందరి ఆందోళన, ఆశీస్సులకు ధన్యవాదాలు” అని ఆమె పేర్కొన్నారు. బాబా ఆరోగ్యం బాగానే ఉందని మరాఠీలోనూ రాసుకొచ్చారు. తండ్రి ఆసుపత్రిలో చేరిన విషయం తెలియగానే పార్టీ కార్యాలయంలో జరుగుతున్న సమావేశం నుంచి సూలే హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు.

- Advertisement -

శరద్ పవార్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. వైద్యుల సూచన మేరకు ఆయన మరో రెండు రోజుల పాటు ఆసుపత్రిలోనే చికిత్స పొందే అవకాశముంది. కాగా, నవంబర్ మొదటి వారంలో కూడా ఛాతీ నొప్పి, శ్వాసకోశ సమస్యలతో పవార్ పూణెలోని రూబీ హాల్ క్లినిక్, అనంతరం ముంబై బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. తాజాగా మరోసారి నీరసించిపోవడంతో వైద్యుల పర్యవేక్షణ కోసం ఆసుపత్రికి తరలించారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News