HomeజాతీయంWomens Reservation | రాహుల్ గాంధీ ఆపలేడు..

Womens Reservation | రాహుల్ గాంధీ ఆపలేడు..

  • మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం..Womens Reservation
  • స్పష్టం చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా..

పార్లమెంట్, అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ గానీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గానీ ఏమాత్రం ఆపలేరని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. దేశంలోని మహిళలకు కచ్చితంగా 33 శాతం రిజర్వేషన్లు అందుతాయని, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ వారికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు పూర్తిగా కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. ఢిల్లీలో నిర్వహించిన ‘సంవిధాన్ గౌరవ్ దివస్’ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.Womens Reservation

గత ఏప్రిల్‌లో 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి, మహిళా కోటాను వేగవంతం చేసేందుకు తీసుకొచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లును విపక్షాలు అడ్డుకున్నాయని అమిత్ షా మండిపడ్డారు. నవంబరు 30న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న వేళ ఆయన ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేవలం రాజ్యాంగ పుస్తకాన్ని చేతిలో పట్టుకుని ప్రదర్శించినంత మాత్రాన రాజ్యాంగాన్ని గౌరవించినట్లు కాదని రాహుల్ గాంధీని ఉద్దేశించి విమర్శించారు. రాజ్యాంగ విలువల పట్ల నిబద్ధత ప్రవర్తనలో కనిపించాలని, న్యాయస్థానాలు, ఎన్నికల సంఘం లాంటి వ్యవస్థలను కించపరచడం కాంగ్రెస్‌కే చెల్లిందని దుయ్యబట్టారు. గతంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించి 18 నెలల పాటు రాజ్యాంగాన్ని చెరబట్టిన చరిత్ర ఆ పార్టీదేనని ఎద్దేవా చేశారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News