ఏపీ డిప్యూటీ సీఎం (AP Deputy CM), అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ 2 రోజులు తిరుపతి(Tirupati), చిత్తూరు (Chittoor) జిల్లాల్లో పర్యటిస్తారు. ఈ నెల 8న తిరుపతి జిల్లా పరిధిలోని ఎర్రచందనం (Red Sandalwood) డిపో(Depot)ను సందర్శిస్తారు. అనంతరం.. కలెక్టరేట్‌లో.. ఎర్రచందనం అక్రమ రవాణా, స్మగ్లింగ్ నిరోధంపై టాస్క్ ఫోర్స్(TaskForce), అటవీ శాఖ అధికారులతో నిర్వహించే సమీక్ష సమావేశం(Review Meeting)లో పాల్గొంటారు. 9వ తేదీ పలమనేరులోని కుంకీ ఏనుగుల క్యాంపు(Kunki Elephant Camp)ను సందర్శిస్తారు. కుంకీ ఏనుగుల సంరక్షణతోపాటు ఏనుగులు, మనుషుల మధ్య సంఘర్షణ నియంత్రణకు అనుసరిస్తున్న నూతన సాంకేతిక విధానాలను పరిశీలిస్తారు.
Pawan Kalyan | 8, 9 తేదీల్లో తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పర్యటన
RELATED ARTICLES
- Advertisment -

