Wednesday, June 3, 2026
Homeఆరోగ్యంBad Breath | మీ నోరు దుర్వాసన వస్తోందా..?

Bad Breath | మీ నోరు దుర్వాసన వస్తోందా..?

  • అయితే ఇలా చెయ్యండి చాలు..

నోటి దుర్వాసనతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. నలుగుట్లో మాట్లాడాలంటే నమోషీగా ఉంటుంది. మన నోటి నుంచి వచ్చే దుర్వాసన కారణంగా ఎదుటివాళ్లు కూడా తీవ్ర అసౌకర్యానికి గురవుతుంటారు. జీర్ణకోశం బలంగా లేకపోతే నోటి దుర్వాసన అధికంగా వుంటుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. అయితే ఈ నోటి దుర్వాసన సమస్య నుంచి బయటపడేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి.

కొబ్బరిపాలలో తగినంత పచ్చ కర్పూరం వేసుకొని తాగాలి. ఈ కొబ్బరి పాలను పచ్చిగా అయినా తాగవచ్చు, వేడి చేసుకుని అయినా తాగవచ్చు. ఇలా తరచూ చేయడంవల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది. అదేవిధంగా గజ నిమ్మకాయను ముందు నాలుగు ముక్కలుగా కోయాలి. ఆ తర్వాత దాన్ని చిన్న ముక్కులుగా తరుగుకుని, ఒక్కో ముక్కను దవడకు వేసుకుని చప్పరిస్తే నోరు శుభ్రపడుతుంది. తద్వారా నోటి దుర్వాసన తగ్గుతుంది. జాజికాయ, జాపత్రీ, పచ్చ కర్పూరం కొద్దికొద్దిగా తీసుకొని దంచుకోవాలి.

- Advertisement -

అనంతరం ఆ పొడిని ఎండుద్రాక్షలతో కలిపి నూరాలి. ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న గోళీల్లా చుట్టుకుని, ఒక్కో గోళిని దవడకు పెట్టుకొని చప్పరిస్తుండాలి. దాంతో క్రమంగా నోటి దుర్వాసన నుంచి ఉపశమనం లభిస్తుంది. తరచూ దాల్చిన చెక్క చిన్నముక్కను తీసుకుని దవడకు పెట్టుకుని నములుతుంటే కూడా నోరు శుభ్రంగా పడుతుంది. ఫలితంగా నోటి దుర్వాసన నుంచి ఉపశమనం కలుగుతుంది. తమలపాకులు కూడా నోటి దుర్వాసనను పోగొట్టడంలో తోడ్పడుతాయి.

ఇవి నాలుకమీద జిగురును హరిస్తాయి. తమలపాకుపై పచ్చకర్పూరం వేసిన కిళ్లీ తింటే నోటిలో మంచి సువాసన వస్తుంది. దాంతో నోటి దుర్వాసన తగ్గుతుంది. అంతేగాక ఏలకులు, లవంగం కూడా నోటి దుర్వాసనని తగ్గిస్తాయి. కాబట్టి తరచూ ఏలకులు గానీ, లవంగాలు గానీ నోట్లో వేసుకోవాలి. ముఖ్యంగా నలుగుట్లోకి వెళ్లేటప్పుడు ఇలా చేయడంవల్ల నోటి దుర్వాసనవల్ల కలిగే ఇబ్బంది నుంచి బయటపడవచ్చు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News