Wednesday, June 3, 2026
Homeనల్లగొండPollution | కాలుష్య కోరలనుంచి కాపాడండి..

Pollution | కాలుష్య కోరలనుంచి కాపాడండి..

  • స్పీకర్ గడ్డం ప్రసాద్ కి వినతిపత్రం అందజేత..
  • అనంతమ్మ గూడెం కాలుష్య విముక్తి పోరాట సమితి సభ్యుల విజ్ఞప్తి..

యాదాద్రి భువనగిరి జిల్లా, పోచంపల్లి మండలం, అంతమ్మ గూడెం గ్రామ పరిధిలో ఉన్న రసాయన పరిశ్రమలు చేస్తున్న కాలుష్యం గురించి తమ గోడు వెల్లబోసుకుంటూ, ప్రముఖ పర్యావరణవేత్తలు కుంభం పురుషోత్తం రెడ్డి, దొంతి నరసింహారెడ్డి సహకారంతో, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కి బుధవారం రోజు అంతమ్మ గూడెం కాలుష్య విముక్తి పోరాట సమితి సభ్యులు వినతిపత్రం అందజేసినారు.

యాదాద్రి భువనగిరి జిల్లా, పోచంపల్లి మండలం పరిధిలోగల అంతమ్మ గూడెం గ్రామ సమీపంలో ఉన్న హజేలో లాబరేటరీ, శ్రీ జయ లాబరేటరీస్, వినీత్ లాబరేటరీస్, బృందావన్, కెమిక్ లైఫ్ సైన్స్, ఆప్టిమస్, విజె సాయి, ఎస్ వి ఆర్ లాబరేటరీస్, ఆర్కిమెడిస్, రావుస్ లేబరేటరీస్, సెన్సేషనల్ అగ్రిసెన్సెస్, ఎస్ వి ఆర్ ట్రేడర్స్ మొదలైన రసాయన పరిశ్రమలు విపరీతమైన వాయు, జల కాలుష్యానికి పాల్పడుతున్నారు.

- Advertisement -

బెంజీన్, ఫాస్జీన్, టొల్యూన్, ఇథైల్ ఓ-జైలీన్, ఐసోప్రోపైల్ బెంజీన్, బెంజీన్, 1,2,4-ట్రైమిథైల్ బెంజీన్, 1,4-డైక్లోరోబెంజీన్, 1,1 డైక్లోరోఈథేన్, అసిటోన్, డైక్లోరోమిథేన్, డైమిథైల్ ఫార్మమైడ్, నాఫ్తలీన్, వంటి విషపూరిత రసాయనాలు గుర్తించబడినాయి.

పరిశ్రమలు చేస్తున్న కాలుష్యం కారణంగా బోరు బావులలో నీటి యొక్క టి.డీ.ఎస్. విలువ 500 లోపు ఉండాల్సింది 50000 వరకు చేరినది.
పరిశ్రమలు చేస్తున్న కాలుష్యం కారణంగా వ్యవసాయం పూర్తిగా దెబ్బతిని ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా మా గ్రామ ప్రజలు చర్మ రోగాలు, కళ్ల మంట, తలనొప్పి, పునరుత్పత్తి సమస్యలతోపాటు ప్రమాదకరమైన క్యాన్సర్, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, జన్యు సంబంధమైన మొదలైన దీర్ఘకాలిక రోగాల బారిన పడుతున్నారని వారు తమ వినతిపత్రంలో తెలిపారు..

ముఖ్యంగా మెసర్స్ హజలో లాబరేటరీ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్ధ వాయువుల వాసనలను మా గ్రామస్తులము భరించలేకుండా ఉన్నాము. ఈ పరిశ్రమ వారు అనుమతి లేని ఉత్పత్తులను తయారు చేస్తూ, మొదటి ప్రపంచ యుద్ధంలో శత్రువులను చంపడానికి ఉపయోగించిన పాస్టీన్ వంటి విషపూరితమైన వ్యర్థ వాయువులు గాలిలో వదిలివేస్తూ ప్రజల జీవించే హక్కును హరిస్తున్నారు. గ్రామ పరిసరాలలో ఉన్న పరిశ్రమలు చేస్తున్న కాలుష్యం గురించి జిల్లా కలెక్టర్ కి, టీజీ పీసీబీ కార్యాలయంలో ఉన్న అధికారులు అందరికీ ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసిన ఎటువంటి ప్రయోజనం లేదని వారు తమ ఆవేదన వ్యక్తం చేశారు..

గ్రామస్తుల ఇబ్బందులను తెలుసుకున్న స్పీకర్ సానుకూలంగా స్పందించి, ఈ కాలుష్యం విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ దృష్టికి తీసుకువెళ్లి, తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారుల ద్వారా సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News