ముఖ్య అతిథిగా హాజరైన ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్
కరీంనగర్, నవంబర్ 5 (ఆదాబ్ హైదరాబాద్): కార్తీక పౌర్ణమి(Kartik Purnima)ని పురస్కరించుకొని కార్తీక దీపోత్సవాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. వేములవాడ (Vemulawada) భీమేశ్వర ఆలయం (Bheemeshwara Temple) భీమేశ్వర సదన్(Bheemeshwara Sadan)లో ఏర్పాటుచేసిన ఈ సామూహిక లక్ష దీపోత్సవాన్ని ముఖ్య అతిథి(Chief Guest)గా హాజరైన ఇన్‌ఛార్జ్ కలెక్టర్ (Incharge Collector) గరిమ అగ్రవాల్ (Garima Agrawal) ప్రారంభించారు. కార్యక్రమంలో వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయ ఈఓ రమాదేవి, ఆర్డీఓ రాధాబాయి, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

