Homeఆరోగ్యంRaw Mango | పచ్చి మామిడికాయతో ఆరోగ్యం..

Raw Mango | పచ్చి మామిడికాయతో ఆరోగ్యం..

  • బోలెడన్ని పోషకాలకు నిలయం..
  • ఎండ తీవ్రత నుంచి కాపాడుతుంది..
  • ఖనిజాలు పుషులంగా ఉంటాయి..

వేసవి రాగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది పండ్ల రాజైన మామిడి పండు. ఆ తియ్యని, రసవంతమైన రుచిని ఇష్టపడని వారుండరు. అయితే కేవలం పండు మాత్రమే కాదు.. పుల్లగా ఉండే పచ్చి మామిడికాయ కూడా ఈ సీజన్‌లో ఒక అమృతం లాంటిదనే చెప్పాలి. ఉగాది పచ్చడి నుండి నోరూరించే ఆవకాయ వరకు, ఘాటైన చట్నీల నుండి చల్లని ఆమ్ పన్నా వరకు పచ్చి మామిడికాయలను ప్రతి ఇంట్లో రకరకాలుగా వాడుతుంటారు. పచ్చి మామిడికాయ కేవలం నోటికి రుచిని అందించడమే కాదు.. ఎండ తీవ్రత నుండి మన శరీరాన్ని కాపాడే బోలెడన్ని పోషకాల గని అని నిపుణులు చెబుతున్నారు. ఇందులో విటమిన్ ఎ, సి, కె, బి6 లతో పాటు ఫైబర్, ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.

Raw Mango Health Benefits Summer Cooling Nutrients Aam Panna Nutrition Facts 1
- Advertisement -
RELATED ARTICLES

Latest News