ఈ విశాల భారతదేశంలో ఏ ప్రాంతమూ ఏ ఒక్కరి సొంత సొత్తు కాదు.. విభిన్న సంస్కృతులు, భిన్నత్వంలో ఏకత్వాల కలయికతోనే ఈ దేశ నిర్మాణం సాధ్యమైంది. సరిహద్దుల గీతలు గీసి, ఎవరి ప్రాంతాల్లో వారే ముడుచుకుపోవాలని శాసిస్తే, మానవ మేధస్సు బావిలో కప్పలా కుంచించుకుపోతుంది. ఒకరిని ఒక చోటికి రావద్దని నిలదీయడానికి, ఈ గడ్డపై పుట్టిన ఏ మనిషికీ ఇంకొకరిపై హక్కు లేదు. కులమతాలకు, ప్రాంతీయ బేధాలకు అతీతంగా… పరస్పర గౌరవంతో కూడిన సమైక్య భారతంతోనే దేశ సమగ్రాభివృద్ధి సాధ్యం. ఎందుకంటే, జగత్తునంతా ఒకే గూటి పక్షులుగా చూసే ‘వసుధైక కుటుంబం’ మన భారతదేశం
- Advertisement -
