- ఎన్టీఆర్ బీసీలకు రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చి ఉన్నత పదవులు కల్పించారు.
- మండల వ్యవస్థ తెచ్చి ప్రజల వద్దకే పాలన.
- జాతీయ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ టిటిడి బోర్డు మెంబర్ బక్కని నరసింహులు..
తండ్రి ఆస్తిలో కూతుళ్లకు ఆస్తి హక్కు కల్పించిన మహానుభావుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు దేనిని టిడిపి జాతీయ పులీడ్ బ్యూరో సభ్యులు, మాజీ టీటీడీ బోర్డు మెంబర్ బక్కని నరసింహులు అన్నారు. మంగళవారం తెలంగాణ అవతరణ దినోత్సవ సందర్భంగా వనపర్తి జిల్లా టిడిపి కార్యాలయంలో ఆయన జెండా ఆవిష్కరణ చేసి మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు కోసం చంద్రబాబు నాయుడు ప్రజల ఆకాంక్ష, ప్రజల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రానికి మూడుసార్లు లెటర్ రాశారని గుర్తు చేశారు.
ఎన్టీ రామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మూడు చోట్ల పోటీ చేసి గెలిచారని .. ఇలాంటి ఘనత ఎవరు సాధించలేదని తెలిపారు. వెనకబడ్డ వర్గాలకు రాజకీయంలో అంత ప్రాధాన్యత లేని సమయంలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీ వర్గాల నాయకులు రాజకీయంగా ఎదిగి ఉన్నత పదవులు అలంకరించారాని కొనియాడారు. ప్రజల అవసరాల అనుగుణంగా ఎన్నో సంస్కరణలు చేసి పరిపాలనను ప్రజల చెంతకు చేరువ చేసి .. దేశంలోనే ఎక్కడలేని విధంగా మాల, మాదిగలకు ఆశ్రమ పాఠశాలలు నెలకొల్పిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అనీ అన్నారు.


నేటి పాలకులు డబ్బు సంపాదనే లక్ష్యంగా ఉంటూ.. ప్రజల అవసరాలు తీర్చడంలో అలసత్వం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుల విమర్శలు పరిష్కారం చూపే విధంగా ఉండాలి కానీ సమస్యలను జటిలం చేసే విధంగా ఉండరాదనీ హితవు పలికారు. ఎన్టీఆర్ అనంతరం చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ స్ఫూర్తిని కొనసాగిస్తూ, మహిళా సంఘాలను ఏర్పరచి మహిళలను ఆర్థిక అభివృద్ధిలో ఆనాడే భాగస్వామ్యం చేశారనీ పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటుచేసి నాణ్యమైన వైద్యం అందించారని..
తెలంగాణలో 1 లక్ష 78 వేల 970 కార్యకర్తల సభ్యత్వలతో తెలుగుదేశం పార్టీ బలంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని లోకేష్ ప్రకటించారని త్వరలో ఆయనకు గ్రామ కృతజ్ఞత సభలు ఏర్పాటు చేసి ప్రజలకు వివరిస్తామని తెలిపారు. కష్టకాలంలోనే తెలుగుదేశం పార్టీ నుండి 15 మంది ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ని ప్రజలు ఆదరించారాని గుర్తు చేశారు. లీడర్లు పోయిన క్యాడర్ అలాగే ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి పి సుధాకర్ నాయుడు, రాష్ట్ర నాయకులు పి చంద్రశేఖర్, రాష్ట్ర నాయకులు కిషన్ నాయక్, పట్టణ అధ్యక్షులు కాగితాల లక్ష్మయ్య, ఆవుల శ్రీను, మేధారి బాలయ్య, హోటల్ బలరాం, కొత్తగొల్ల శంకర్, అప్పాయి పల్లి బాలయ్య, డి బాలరాజ్, షాకీర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
