- హైదరాబాద్ వేదికగా చల్లా రామ్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కార్యక్రమం..
- 10 ఏళ్ల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న బీ ద చేంజ్ వెల్ఫేర్ సొసైటీ..
- విశేష సేవలు అందించిన విజేతలకు నాలుగు ప్రధాన విభాగాల్లో పురష్కారం..
సమాజంలో నిస్వార్థంగా సేవలందిస్తూ, ప్రజల జీవితాల్లో సానుకూల మార్పుకు కారణమవుతున్న వ్యక్తులను గుర్తించి గౌరవించే లక్ష్యంతో నిర్వహించిన ప్రతిష్టాత్మక ‘చేంజ్ మేకర్స్ అవార్డ్స్ 2026’ కార్యక్రమం హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగింది. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతూ 10 ఏళ్ల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న ‘బి ద చేంజ్ వెల్ఫేర్ సొసైటీ’ ఆధ్వర్యంలో ఈ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. “సెలెబ్రేటింగ్ 10 ఇయర్స్ ఆఫ్ ట్రాన్సఫార్మింగ్ లైవ్స్ ” అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం “హానరింగ్ ఆర్డినరీ పీపుల్ క్రియేటింగ్ ఎక్స్ట్రార్డినరీ చేంజ్ ” అనే ప్రధాన లక్ష్యంతో సాగింది. సమాజంలోని వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వ్యక్తులను ఈ సందర్భంగా సత్కరించారు.
‘బి ద చేంజ్ వెల్ఫేర్ సొసైటీ’ నిర్వహకులు చల్లా రామ్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జస్టిస్ జి. రాధా రాణి, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీను బాబు, బి.ఎం.వినోద్ కుమార్, ఎ. శ్రీధర్, విమలా బండ్రు, వసంత కుమారి పాల్గొన్నారు. సమాజంలో విశేష సేవలు అందించిన విజేతలకు నాలుగు ప్రధాన విభాగాల్లో పురస్కారాలను ప్రదానం చేశారు.

అపెక్స్ అవార్డు : పదేళ్లకు పైగా నిరంతరాయంగా సేవలందించిన ప్రముఖులకు ‘వాన్‌గార్డ్ గౌరవ హోదాతో సత్కారం.
చేంజ్ మేకర్స్ అవార్డు : సమాజంలో విశేష మార్పు తీసుకొచ్చిన ప్రథమ విజేతలకు ‘ప్రైమ్ హోదాతో అవార్డు.
ది పల్స్ అవార్డు : సామాజిక సేవలో ప్రత్యేక కృషి చేసిన రన్నరప్ విజేతలకు ‘కెటలిస్ట్ గౌరవ పురస్కారం.
మెవరిక్ అవార్డు : ప్రత్యేక జ్యూరీ ఎంపిక చేసిన వ్యక్తులకు ‘మెవరిక్ అవార్డు.
11 కీలక రంగాల్లో ఎంపిక :
విద్య, మహిళా సాధికారత, శిశు సంక్షేమం, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, జంతు సంరక్షణ, సాంకేతికత, సామాజిక సేవ, మానవ హక్కులు, క్రీడలు, కళలు-సంస్కృతి తదితర 11 ప్రధాన రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారిని ఈ అవార్డుల కోసం ఎంపిక చేశారు.
ప్రముఖ సంస్థల భాగస్వామ్యం :
ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి మైక్రోసాఫ్ట్ సీఎస్‌ఆర్ పార్ట్నర్‌గా, టెక్ మహీంద్రా వెన్యూ పార్ట్నర్‌గా వ్యవహరించాయి. మీడియా పార్ట్నర్‌గా కైజర్ న్యూస్, నాలెడ్జ్ పార్ట్నర్‌గా టి.కె.ఆర్.ఈ.ఎస్ ఫౌండేషన్, టికెటింగ్ పార్ట్నర్‌గా పిక్ పాస్ సహకరించాయి.
ఈ సందర్భంగా ‘బి ద చేంజ్’ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు మాట్లాడుతూ, గత దశాబ్ద కాలంగా సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని, ఈ అవార్డులు మరింత మంది సేవా భావంతో ముందుకు రావడానికి ప్రేరణగా నిలుస్తాయని తెలిపారు. సమాజ శ్రేయస్సు కోసం అంకితభావంతో పనిచేసిన విజేతలందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
