Tuesday, June 2, 2026
Homeస్పోర్ట్స్Comeback | మళ్ళీ రాకెట్ పట్టనున్న సెరీనా..

Comeback | మళ్ళీ రాకెట్ పట్టనున్న సెరీనా..

  • 45 ఏళ్ల వయసులో తిరిగి ఆడనున్న క్రీడాకారిణి..
  • ఈవెంట్ లో పాల్గొనేందుకు వైల్డ్ కార్డు ఎంట్రీ..

మ‌హిళ టెన్నిస్‌లో దిగ్గ‌జ క్రీడాకారిణి సెరీనా విలియ‌మ్స్ మ‌ళ్లీ రాకెట్ ప‌ట్ట‌నున్న‌ది. దాదాపు నాలుగేళ్ల పాటు ప్రొఫెష‌న‌ల్ ఆట‌కు దూరంగా ఉన్న ఆమె.. త్వ‌ర‌లో ప్రారంభంకానున్న క్వీన్స్ క్ల‌బ్ టోర్నీలో ఆడ‌నున్న‌ది. మ‌హిళ‌ల డ‌బుల్స్ ఈవెంట్‌లో పాల్గొనేందుకు ఆమె వైల్డ్ కార్డు పొందింది. జూన్ 8వ తేదీ నుంచి ఆ పోటీ ప్రారంభంకానున్న‌ది. కెన‌డా యువ ప్లేయ‌ర్ విక్టోరియా మొబోకో తో ఆమె జ‌త‌క‌ట్ట‌నున్న‌ది. 2022 నుంచి సెరీనా టెన్నిస్‌కు దూరంగా ఉంది. త‌న 27 ఏళ్ల కెరీర్‌లో సెరీనా ఇప్ప‌టి వ‌ర‌కు 23 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలుచుకున్న‌ది.

సెరీనా మ‌ళ్లీ రాకెట్ ప‌ట్ట‌బోతున్న‌ట్లు గ‌త ఏడాది నుంచే రూమ‌ర్స్ వ‌చ్చాయి. డ్ర‌గ్ టెస్టింగ్ పూల్‌కు ప్లేయ‌ర్లను రిజిస్ట‌ర్ చేసిన లిస్టులో సెరీనా పేరు ఉండ‌డంతో ఆ అనుమానాలు వ్యాప్తి అయ్యాయి. అయితే తాజాగా సోమ‌వారం సెరీనా త‌న సోష‌ల్ మీడియాలో ఓ వీడియోను పోస్టు చేసింది. త‌న తదుప‌రి జ‌ర్నీ ప్రారంభించేందుకు క్వీన్స్ క్ల‌బ్ ప‌ర్ఫెక్ట్ ప్లేస్ అని ఆలోచిస్తున్న‌ట్లు విలియ‌మ్స్ పేర్కొన్న‌ది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News