Thursday, June 11, 2026
Homeమహబూబ్‌నగర్‌Devarakadra | తెలంగాణలో తొలి సంస్కార శాల…

Devarakadra | తెలంగాణలో తొలి సంస్కార శాల…

  • సంస్కార శాల 2వ రోజు యాగ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ పార్టీ దేవరకద్ర నియోజకవర్గ ఇంచార్జ్ కొండ ప్రశాంత్ రెడ్డి
  • చిన్నారుల్లో భారతీయ సంస్కృతి – నైతిక విలువల పెంపుకు ప్రత్యేక శిక్షణ

తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా దేవరకద్రలో నిర్వహిస్తున్న “సంస్కార శాల” ప్రత్యేక శిక్షణ తరగతులు విశేష ఆదరణ పొందుతున్నాయి. చిన్నారుల్లో భారతీయ సంస్కృతి, నైతిక విలువలు, ఆధ్యాత్మికత మరియు క్రమశిక్షణ పెంపొందించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

శ్రీవత్స వైదిక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డోకుర్ పవన్ కుమార్ రెడ్డి సహకారంతో దేవరకద్రలోని తపోవన్ పాఠశాలలో ఆరు రోజులపాటు ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. 09నుండి 17 సంవత్సరాల వయస్సు గల చిన్నారులకు యోగా, ప్రాణాయామం, శారీరక వ్యాయామాలు, ధ్యానం, మనోవికాసం, భారతీయ సంస్కృతి మరియు నైతిక విలువలపై ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. చిన్నారులు ఉత్సాహంగా పాల్గొంటుండగా, తల్లిదండ్రుల నుంచి కూడా విశేష స్పందన లభిస్తోంది.

- Advertisement -

ఈ సందర్భంగా కాశి, అయోధ్య వంటి ఆధ్యాత్మిక క్షేత్రాల నుంచి వచ్చిన విద్వాంసులు మాట్లాడుతూ.. నేటి సమాజంలో పిల్లలకు కేవలం విద్య మాత్రమే కాకుండా సంస్కారం కూడా అత్యంత అవసరమని పేర్కొన్నారు. సంస్కార శాల ద్వారా చిన్నారుల్లో మంచి అలవాట్లు, క్రమశిక్షణ, దేశభక్తి, ఆధ్యాత్మిక భావనలు పెంపొందుతాయని తెలిపారు.

భవిష్యత్ తరాలకు భారతీయ సంస్కృతి పరిరక్షణ ఎంతో అవసరమనే ఉద్దేశంతో నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల నుంచి 70 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. దేవరకద్రలో ప్రారంభమైన ఈ సంస్కార శాల రాష్ట్రవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తుందని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ కార్యక్రమంలో రాజ మల్లారెడ్డి,చిన్న,వెంకట్ రెడ్డి,రాజు,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News