Homeఆరోగ్యంPapaya | బొప్పాయి రసం ప్లేట్లెట్స్ పెంచుతుందా..?

Papaya | బొప్పాయి రసం ప్లేట్లెట్స్ పెంచుతుందా..?

  • చికిత్సలో ఉపయోగిస్తున్న వైద్యులు..

వర్షాకాలంలో డెంగీ కేసులు పెరుగుతుండటంతో ఈ వ్యాధి నుంచి త్వరగా కోలుకోవడానికి ఏం చేయాలనే అంశంపై చాలామందిలో ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా బొప్పాయి ఆకుల రసం ప్లేట్‌లెట్ కౌంట్‌ను పెంచుతుందనే నమ్మకం చాలాకాలంగా ఉంది. దీనిపై కొన్ని పరిశోధనలు కూడా జరిగాయి. అయితే బొప్పాయి ఆకులు డెంగీకు చికిత్సగా పనిచేస్తాయా, వాటిని ఎలా ఉపయోగించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను తెలుసుకోవడం ముఖ్యం. డెంగీ సోకినప్పుడు రక్తంలోని ప్లేట్‌లెట్ కౌంట్ వేగంగా తగ్గడం ఒక ముఖ్యమైన సమస్యగా మారుతుంది. దీన్ని థ్రాంబోసైటోపీనియా అంటారు.

ప్లేట్‌లెట్ కౌంట్‌ను వైద్యుల సూచన మేరకు నిరంతరం పర్యవేక్షించడం అవసరం. ఈ కారణంగానే కొంతమంది డెంగీ రోగులకు ఆసుపత్రిలో చికిత్స అవసరమవుతుంది. బొప్పాయి ఆకులను, ముఖ్యంగా కారికా ప‌పాయా ఆకుల ఎక్స్‌ట్రాక్ట్‌ను, డెంగీ సమయంలో ప్లేట్‌లెట్ కౌంట్‌ను పెంచేందుకు సంప్రదాయంగా ఉపయోగిస్తున్నారు. బొప్పాయి ఆకుల్లోని కొన్ని పదార్థాలు రక్తంలోని ప్లేట్‌లెట్ల ఉత్పత్తికి సంబంధించిన ప్రక్రియలకు సహాయపడతాయ‌ని పరిశోధనలు సూచిస్తున్నాయి. అలోక్స్ 12, పీటీఏఎఫ్ఆర్ వంటి జన్యువులు ప్లేట్‌లెట్ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియల్లో కీల‌క పాత్ర పోషిస్తాయని అధ్యయనాలు పేర్కొన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News