Homeమహబూబ్‌నగర్‌Kadthal | వీరత్వానికి నిలువెత్తు నిదర్శనం.. సర్వాయి పాపన్న గౌడ్‌

Kadthal | వీరత్వానికి నిలువెత్తు నిదర్శనం.. సర్వాయి పాపన్న గౌడ్‌

  • కడ్తాల్‌లో ఘనంగా సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ జయంతి

బహుజన చక్రవర్తి,బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి,గౌడ ముద్దుబిడ్డ సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ జయంతి వేడుకలను కడ్తాల్‌ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.కడ్తాల్‌ మండల గౌడ సంఘం అధ్యక్షులు మాలె మల్లేష్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సర్వాయి పాపన్న గౌడ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..

సర్వాయి పాపన్న గౌడ్‌ బడుగు,బలహీనవర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయుడని,ఆయన ధైర్యసాహసాలు,సామాజిక సమానత్వం కోసం చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.పాపన్న గౌడ్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయిళ్ళ శ్రీనివాస్‌ గౌడ్‌,యాట నర్సింహ, సర్పంచ్‌ రాయికంటి బిక్షపతి, ఉపసర్పంచ్‌ ఈరెడ్డి యాదగిరిరెడ్డి,దోనాదుల మహేష్‌, మాజీ జెడ్పీటీసీ దశరథ్‌ నాయక్‌,మార్కెట్‌ వైస్ చైర్మన్‌ గూడూరు భాస్కర్‌రెడ్డి,బీసీ సంఘం కడ్తాల్‌ మండల అధ్యక్షులు మాదారం గణేష్‌ గౌడ్‌,బీజేపీ జిల్లా కౌన్సిల్‌ సభ్యులు మాలె శ్రీశైలం గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

అలాగే కందికంటి వెంకటయ్య గౌడ్‌,యాదయ్య గౌడ్‌,రమేష్‌ గౌడ్‌,శ్రీశైలం గౌడ్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, నరసింహ గౌడ్‌,రమేష్‌ గౌడ్‌,శ్రీరాములు గౌడ్‌,చంద్రమౌళి గౌడ్‌, రాజేందర్‌ గౌడ్‌, రమేష్‌ గౌడ్‌,మహేందర్‌ గౌడ్‌,శివ గౌడ్‌,అంజయ్య గౌడ్‌, శ్రీను గౌడ్‌, బాను గౌడ్‌, మహేందర్‌ గౌడ్‌, జగదీష్‌ గౌడ్‌, శ్యామ్‌సుందర్‌ గౌడ్‌, శేఖర్‌ గౌడ్‌, మహేందర్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News