తెలంగాణలో మొదటి కొరియన్ టెక్నాలజీ ఆధారిత వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని వికే కొరియన్ డెర్మా హాస్పిటల్ వ్యవస్థాపకులు కార్తీక్ తెలియజేశారు.ఈ మేరకు బుధవారం తమ క్లినిక్ ని ప్రారంభించనున్నామన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో అతిధులుగా తెలుగు సినిమా రంగ ప్రముఖులు పాల్గొంటారన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు చర్మవ్యాధుల నిపుణుడు డాక్టర్ ప్రణయ్ రెడ్డి తో కలిసి మాట్లాడారు.
చర్మం,జుట్టు సమస్యలకు అత్యాధునిక కొరియన్ చికిత్సలు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. హైదరాబాద్ తో పాటు బెంగళూరులో సైతం తమ క్లినిక్ ప్రారంభించినట్లు తెలిపారు.చర్మంపై వచ్చే పిగ్మెంటేషన్, మెలాస్మా, స్కిన్ టైటెనింగ్‌తో పాటు వివిధ రకాల చర్మ సంబంధిత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు అందిస్తున్నట్లు వివరించారు. అదే విధంగా హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్, హెయిర్ ఫాల్ ట్రీట్‌మెంట్స్‌తో పాటు జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సేవలు కూడా క్లినిక్‌లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.
కొరియా నుంచి నేరుగా ఉత్పత్తులు, వినియోగ వస్తువులను దిగుమతి చేసుకుంటున్నామని, ఇందుకోసం పలు కొరియన్ కంపెనీలు,తయారీ సంస్థలతో భాగస్వామ్యం చేసుకున్నామని కార్తీక్ తెలిపారు. భారతీయుల చర్మానికి ఈ ఉత్పత్తులు అనుకూలంగా ఉన్నాయా లేదా అనే అంశంపై సమగ్ర పరీక్షలు నిర్వహించిన తర్వాతే వాటిని వినియోగిస్తున్నామని చెప్పారు. అలాగే ఎఫ్‌డీఏ, సీడీఎస్‌సీవోతో పాటు భారతీయ నిబంధనలకు అనుగుణంగా అవసరమైన అన్ని అనుమతులు పొందిన తర్వాతే ఈ చికిత్సలను అందిస్తున్నామని స్పష్టం చేశారు.
