Thursday, May 21, 2026
Homeఆదిలాబాద్Mancherial ACP | నకిలీ విత్తనాలు అమ్మితే చట్టపరమైన చర్యలు తప్పవు

Mancherial ACP | నకిలీ విత్తనాలు అమ్మితే చట్టపరమైన చర్యలు తప్పవు

  • మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాష్

రైతులకు నకిలీ విత్తనాలు,ఎరువులు అందజేస్తే వాటిని విక్రయించిన డీలర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్ పేర్కొన్నారు.మంచిర్యాల డివిజన్ పరిధిలోని విత్తనాలు, ఎరువుల డీలర్లకు ఈ రోజు మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేట గ్రామంలోని రైతు వేదికలో నకిలీ విత్తనాల నియంత్రణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డీలర్లు ఏ విధంగా బాధ్యత వహించాలి, నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే అంశాలపై పోలీసు,వ్యవసాయ శాఖల సమన్వయంతో అవగాహన కల్పించారు.

అంతేకాకుండా నకిలీ విత్తనాలు విక్రయించిన డీలర్లతో పాటు తయారీ కంపెనీలపై కూడా కఠిన చర్యలు తీసుకునేలా ఉన్న చట్టాల గురించి వివరించారు.ఈ సందర్భంగా మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాష్ మాట్లాడుతూ,డీలర్లు తమ షాపులకు సంబంధించిన లైసెన్సులు తప్పనిసరిగా కలిగి ఉండాలని తెలిపారు. షాపులో ఉన్న స్టాక్‌ను రోజువారీగా నమోదు చేయడంతో పాటు విత్తనాలు,పురుగుల మందులు, ఎరువులకు సంబంధించిన స్టాక్ రిజిస్టర్,బిల్లు బుక్ తప్పనిసరిగా నిర్వహించాలని సూచించారు.

- Advertisement -

రైతులకు ఇచ్చే ప్రతి బిల్లుపై రైతు సంతకం తప్పనిసరిగా తీసుకోవాలని, ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయించరాదని తెలిపారు.ఫర్టిలైజర్లు, పెస్టిసైడ్స్‌కు సంబంధించిన ఫారమ్‌లు,పీసీలు లైసెన్సులో తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలని సూచించారు.విత్తనాలకు సంబంధించిన సోర్స్ సర్టిఫికెట్లు అందుబాటులో ఉంచాలని, షాపులో ఉన్న సరుకు మరియు స్టాక్ రిజిస్టర్ మధ్య ఎలాంటి తేడాలు లేకుండా చూసుకోవాలని తెలిపారు.

గడువు ముగిసిన విత్తనాలు, ఎరువులు విక్రయించరాదని హెచ్చరించారు.ప్రతి స్టాక్ రిజిస్టర్, బిల్లు బుక్‌పై మండల వ్యవసాయ అధికారి చేత అటెస్టేషన్ చేయించుకోవాలని, ప్రతి 15 రోజులకు ఒకసారి స్టాక్ రిపోర్టును మండల వ్యవసాయ అధికారి కార్యాలయానికి పంపించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సీఐ రమణమూర్తి, హాజీపూర్ ఎస్సై కిరణ్ కుమార్,లక్షెట్టిపేట ఎస్సై సురేష్ కుమార్, జన్నారం ఎస్సై ఉదయ్ కిరణ్, వ్యవసాయ శాఖ అధికారులు,డీలర్లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News