- దేశవ్యాప్తంగా పెరుగుతున్న డిజిటల్ అరెస్ట్ మోసాలు
- ఏకంగా రూ.3 వేల కోట్లు కొల్లగొట్టిన సైబర్ మోసగాళ్లు
- సైబర్ నేరాల పట్ల సుప్రీంకోర్టు ఆందోళన
- సీబీఐ(CBI) దర్యాప్తునకు ఆదేశించే యోచనలో సుప్రీంకోర్టు
డిజిటల్ అరెస్టు(Digital Arrest) కేసుల్లో కఠిన శిక్షలు విధించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు(Supreme Court) అభిప్రాయపడింది. చాలా విస్తృత స్థాయిలో జరుగుతున్న సైబర్ నేరాల పట్ల అత్యున్నత న్యాయస్థానం షాక్ వ్యక్తం చేసింది. డిజిటల్ అరెస్టు కేసుల్లో బాధితులు సుమారు 3000 కోట్లు(3000 Crores) కోల్పోవడం పట్ల కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. సైబర్(Cyber) నేరాలకు పాల్పడుతున్న మోసగాళ్లు తమకు తాము భద్రతా సిబ్బందిగా, కోర్టు అధికారులుగా, ప్రభుత్వాధికారులు పరిచయం చేసుకుని బెదిరింపులకు పాల్పడు తున్నారు. ఆడియో(Audio), వీడియో(Video) కాల్స్తో(Calls) బాధితులను పీడిస్తున్నారు. బాధితులను కాల్స్తో బందీలుగా చేసి .. డబ్బులు చెల్లించేలా వత్తిడి తెస్తున్నారు.
చీఫ్ జస్టిస్ సూర్య కాంత్(Chief Justice Surya Kant), ఉజ్వల్ భుయాన్(ujjal bhuyan) , జోయ్మాలా బాగ్చిలతో కూడిన ధర్మాసనం డిజిటల్ అరెస్టు కేసులపై విచారణ చేపట్టింది. ఈ విషయంలో కోర్టుకు సూచనలు చేసేం దుకు అమికస్ క్యూరీని నియమించారు. కేంద్ర హోంశాఖ, సీబీఐ(CBI) సమర్పించిన రెండు నివేది కలను కోర్టు పరిశీలించింది. డిజిటల్ అరెస్టుతో బాధితుల నుంచి సైబర్ నేరగాళ్లు సుమారు మూడు వేల కోట్లు వసూల్ చేయడం షాకింగ్గా ఉందని, బాధితుల్లో సీనియర్ సిటిజన్లు ఉన్నారని, ఒకవేళ ఇలాంటి కేసుల్లో కఠినమైన ఆదేశాలు ఇవ్వకుంటే, ఈ సమస్య మరింత జఠిలంగా తయారు అవుతు ందని ధర్మాసనం పేర్కొన్నది. జుడిషియల్ ఆదేశాలతో భద్రతా ఏజెన్సీలను బలోపేతం చేయాలని, ఇలాంటి కేసులపై ఉక్కుపాదం మోపాలని కోర్టు పేర్కొన్నది.
డిజిటల్ అరెస్టుల కేసులపై నవంబర్ 10వ తేదీ మళ్లీ విచారణ చేపట్టనున్నారు. అమికస్ క్యూరీ ఇచ్చే సూచనల ఆధారంగా కొన్ని ఆదేశా లు ఇవ్వనున్నట్లు కోరింది. సిండికేట్ నేరగాళ్లు ఆఫ్ర్ లొకేషన్ల నుంచి ఇలాంటి నేరాలకు పాల్పడు తున్నారని సీబీఐ తన రిపోర్టులో చెప్పినట్లు జస్టిస్ కాంత్ పేర్కొన్నారు. కేంద్రం, సీబీఐ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. కేంద్ర హోంశాఖకు చెందిన సైబర్ డివిజన్ ఇలాంటి కేసుల్ని డీల్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. హర్యానాకు చెందిన ఓ మహిళ సీజేఐ బీఆర్ గవాడ్కి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసును వాదిస్తున్నారు. తప్పుడు కోర్టు ఆదేశాలను చూపి స్తూ నేరగాళ్లు ఫ్రాడ్కు పాల్పడినట్లు ఆమె ఆరోపించింది. ఆ వృద్ధ మహిళ నుంచి నేరగాళ్లు కోటికి పైగా లూటీ చేశారు. సీబీఐ, ఈడీ, జుడిషియల్ అధికారులమని చెప్పి ఆడియో, వీడియో కాల్స్తో బెదిరించారని ఆమె పేర్కొన్నది. అంబాలాలో ఈ ఘటనపై రెండు కేసులు నమోదు అయ్యాయి.
