Thursday, May 28, 2026
Homeహైదరాబాద్‌Land Dispute | మాజీ మంత్రి హరీష్ రావు అన్యాయం చేస్తున్నాడు..

Land Dispute | మాజీ మంత్రి హరీష్ రావు అన్యాయం చేస్తున్నాడు..

  • మా పూర్వికుల భూములను ప్రభుత్వ భూములుగా చిత్రీకరిస్తున్నారు..
  • మీడియాతో వాపోయిన బాధితుడు మొహమ్మద్ మాకృద్దీన్..

మా తాత ముత్తాతల నుండి మాకు వచ్చిన స్థిరాస్తులను మాజీ మంత్రి హరీష్ రావు తప్పుదారి పట్టిస్తూ, ప్రభుత్వ భూములని అసత్యపు ప్రచారం చేస్తున్నారని మొహమ్మద్ ముక్రుద్దిన్ ఖాన్ ఆరోపించారు. మా ఐదు తరాల నుండి తమ ఆధీనంలో ఉన్న రంగారెడ్డి జిల్లా పెద్ద షాపూర్ శివారులోని సర్వే నెం. 172 నుండి 182 వరకు ఉన్న 171 ఎకరాల వ్యవసాయ భూములను తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… మా ముత్తాత నవాబ్ రఫీయోద్దీన్ పట్టేదర్గా ఉన్నారని తాము రికార్డులను కోర్టులకు సైతం అందజేశామని అన్నారు.

కోర్టులు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని మేమే ఇందుకు సరైన వారసులమని ఆజ్ఞాపించిందని ఇందుకు సంబంధించిన దస్తావేజులను ప్రదర్శించారు. ఈ విశయంలో తాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తమకు పట్టాలను మంజూరు చేయాల్సిందిగా కోరామన్నారు. గతంలోనే కోర్టు ఆర్డర్లు ఉన్నప్పటికీ అక్కడి ఆర్డీవోను మాజి మంత్రి తన ఆధీనంలో ఉంచుకుని తమకు పట్టాలు రాకుండా అడ్డుపడ్డారని ఆరోపించారు.

- Advertisement -

పదేళ్ల పాటు న్యాయస్థానాల్లో కేసుల్లో అన్యాయాలను ఎదిరించి గెలుపొందామని పలు విశయాలను గుర్తు చేశారు. కోర్టులు ఆదేశించిప్పటికీ అక్కడి ఆర్డీవో అడ్డు పడటంతో తహశిల్దార్లు తమకు పట్టాలు అందిచలేదని అదికారుల తీరు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న భూభారతిలో ధరఖాస్తు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమకు పట్టాలు అందజేస్తారన్న విశ్వాసం ఉందని తెలిపారు. సమావేశంలో ఆయనతో పాటు ఆయన కుమారులు నవాబ్ జాఫరుద్దీన్, ఆధీమ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News