కరీంనగర్: మండల కేంద్రమైన బోయిన్ పల్లి లో భగీరథ పైప్ లైన్ పగిలి ఆరు నెలలుగా వృధాగా నీరు పోతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. బోయినపల్లి నుండి గంగాధర వెళ్లే మేన్ రోడ్ ప్రక్కన పైప్ లైన్ పగిలింది. గ్రామానికి నీరు సరఫరా చేసేందుకు భగీరత కింద వేసిన పైప్ లైన్ పగిలి అరునెలల కాలంగానీరు వృధాగా పోతున్న సంబంధించిన అధికారులు పట్టించుకోవడం లేదని దేంతో నీటికి ఇబ్బందులు కలగడమే కాకా మురికి నీరుకు పైపుల ద్వారా సరఫరా జరుగుతుంది. ఇప్పటి కయినా అధికారులు మరమ్మతులు చేయించాలని బీ ఎస్ పి నాయకులు పెగ్గర్ల మహేందర్ కోరుతున్నారు ఈ విషయమై స్థానిక పంచాయితీ కార్యదర్శిని తెల్సుకొగా రెండురోజుల్లో మారమ్మత్తు చేయిస్తానని తెలిపారు
