- ఆడపిల్ల పుట్టిందని భార్యకు అబార్షన్..
- సర్ధిచెప్పిన అత్తపై దాడి చేసిన మస్తాన్..
పల్నాడు జిల్లా క్రోసూరు మండలం నాగవరానికి చెందిన మస్తాన్ వలికి సత్తెనపల్లికి చెందిన కరిష్మాతో ఆరు ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి మొదటి సంతానంగా ఆడపిల్ల పుట్టింది. మరోసారి గర్భవతి అయిన కరిష్మాకు స్కానింగ్ మరోసారి ఆడపిల్లే అని తేలింది. దీంతో మస్తాన్ వలి భార్య కరిష్మాకు ఆబార్షన్ చేయించాడు. అప్పటి నుండి భార్య భర్తల మధ్య విబేధాలు మొదలయ్యాయి. నీకు ఆడపిల్లలే పుడుతున్నారంటూ ఆమెను వేధించసాగాడు. ఈ క్రమంలోనే మొదటి ఆడపిల్ల ఉందని ఆమెకు కరిష్మా పుట్టింటి వాళ్ల పేరు మీద ఉన్న ఇంటిని రాయించాలంటూ ఒత్తిడి చేస్తున్నాడు.
వారం రోజుల క్రితం భార్య భర్తల మధ్య ఆ ఇంటి విషయమై మరోసారి ఇద్దరి గొడవ జరిగింది. దీంతో కరిష్మాను ఆమె కూతురు నేహా అంజుమ్ ను… మస్తాన్ వలి పుట్టింటికి పంపించేశాడు. వారం రోజుల పాటు సత్తెనపల్లిలోని పుట్టింట్లోనే ఉన్న కరిష్మా, ఆమె కుమార్తె ను తీసుకొని కరిష్మా తల్లి అల్లాబీ.. కరిష్మా అమ్మమ్మ ఫాతిమా ఆటోలో నాగవరం వచ్చారు. అక్కడ మస్తాన్ వలితో పాటు ఆమె కుటుంబ సభ్యులకు కరిష్మావాళ్లకు గొడవ జరిగింది. ఆడిపిల్లలు పుడుతున్నారని పుట్టింటికి పంపించడంపై కరిష్మా తల్లి మస్తాన్ వలిని అదే విధంగా వారి బంధువులను నిలదీసింది. ఈ వివాదం జరుగుతుండగానే మస్తాన్ వలి కర్రలు, రాడ్లతో కరిష్మా వాళ్లపై దాడి చేశారు.
