- మీడియా ప్రముఖులకు ఆహ్వాన పత్రిక అందించిన ఆదాబ్ సీఎండీ సత్యం వీరమళ్ళ
- తప్పకుండా హాజరు కావాలని విజ్ఞప్తి..
- శుభాకాంక్షలు తెలిపిన మీడియా ప్రముఖులు
మీడియా ఔన్నత్యాన్ని కాపాడుతూ తమ 14 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటూ.. అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు వారథిగా గురుతర బాధ్యతలు నిర్వహిస్తూ 15వ సంవత్సరంలోకి అడుగిడిన శుభసందర్భంగా ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దినపత్రిక తమ 15వ వార్షికోత్సవ వేడుకలను ఈ నెల 26 తారీఖునాడు ప్రతిష్టాత్మక రవీంద్రభారతి వేదికగా జరుపుకుంటోంది.. ఈ వేడుకకు ప్రముఖులను ఆహ్వానించే క్రమంలో శనివారం రోజు మీడియా ప్రముఖులకు ఆహ్వానపత్రిక అందించారు.. ఆదాబ్ సీఎండీ సత్యం వీరమళ్ళ..


ఈ క్రమంలో టీవీ 5 అధినేత, టీటీడీ చైర్మన్ బీ.ఆర్.కె. నాయుడు, జూబ్లీహిల్స్ కోపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ అధ్య క్షులు బీ. రవీంద్ర నాథ్, సీవీఆర్ న్యూస్ చైర్మన్ సి.వీ. రావు, సీఓఓ ఎల్.పీ. వాజపేయి, ఆంద్రప్రభ దినపత్రిక సీఎండీ ముక్త రమేష్, జనరల్ మేనేజర్ పసునూరి రమేష్ లకు ఆహ్వాన పత్రిక అందించి తప్పకుండా కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. ఆహ్వానం అందుకున్న మీడియా ప్రముఖులు తప్ప కుండా ఈ వేడుకకు హాజరవుతామని హామీఇస్తూ.. ఆదాబ్ యాజ మాన్యా నికి, సిబ్బందికి శుభాకాంక్షలు అందజేశారు. ఈ కార్య క్రమంలో పల్లె లక్షణ్ రావు గౌడ్, అందే శ్రీధర్ రెడ్డిలు పాల్గొన్నారు..


