దేశ రాజధాని వీధుల్లో న్యాయం కోసం విద్యార్థుల రక్తం చిందినప్పుడు… అధికార ప్రభుత్వం మౌనం వహించడం శాంతి కాదు, అది నేరపూరిత ఉదాసీనత.. లక్షలాది మంది యువత భవిష్యత్తును ఛిద్రం చేసిన వైఫల్యాలకు బాధ్యులెవరో తేల్చకుండా.. మంత్రులను కాపాడుతూ… ప్రశ్నించే గొంతులపై లాఠీలు, భాష్పవాయువు ప్రయోగించడం ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ఢిల్లీ నుండి హైదరాబాద్ వరకు రగులుతున్న ఈ విద్యార్థి ఆగ్రహజ్వాల… కేవలం ఒక నిరసన కాదు, పాలకుల నిర్లక్ష్యంపై భావి భారత భవిష్యత్తు తరం చేస్తున్న సింహగర్జన.. గుర్తుంచుకోండి… యువత కళ్లలో ఆశలు చచ్చిపోయినప్పుడు.. పాలకుల సింహాసనాలు శాశ్వతంగా శిధిలమై పోతాయి..
- బీవీఆర్ రావు..
- Advertisement -
