కరీంనగర్ రూరల్ సీఐ ఏ. నిరంజన్ రెడ్డి
కరీంనగర్ రూరల్ పరిధిలో అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు (Police) ఉక్కుపాదం (Iron Foot) మోపారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు (Strict Measures) తీసుకుంటామని కరీంనగర్ రూరల్ సీఐ ఏ. నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం ఉదయం గ్రామాల్లో పోలీసులు పెట్రోలింగ్ (Patrolling) నిర్వహిస్తున్న సమయంలో బొమ్మకల్లు ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద మానేరు నది నుండి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న ముగ్గురిని కరీంనగర్ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. దర్శనాల మహేష్, పుట్టరాజు, పండుగ అనిల్ ఇతను యజమాని అయిన నీరుకుల్ల కుమార్ సూచనల మేరకు రవాణా చేస్తున్నట్లు తెలిపారు.

నిందితులను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసి, తదుపరి చర్య నిమిత్తం కోర్టుకు పంపించారు. ఈ సందర్భంగా సీఐ ఏ. నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ… గతంలో ఎప్పుడైనా అక్రమ ఇసుక రవాణా చేసి ఉండి, మరొకసారి అక్రమ రవాణా చేస్తూ పట్టుబడినట్లయితే వారి ట్రాక్టర్లను సీజ్ చేసి కోర్టులో డిపాజిట్ చేస్తామని, అంతేకాకుండా వారిపై పీడీ యాక్ట్ (PD Act) కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

