సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం
జూబ్లీహిల్స్ (JubileeHills) నియోజకవర్గం రహ్మత్ నగర్ లోని శ్రీరామ్ నగర్ చౌరస్తాలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ఏర్పాటుచేసిన కార్నర్ మీటింగ్(Corner meeting)కు CM రేవంత్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి సపోర్టు చేసిన ఏఐఎంఐఎం(MIM), సిపిఐ(CPI), సిపిఎం(CPM), మాదిగ దండోరా(Madhiga Dandora), ఇతర కుల సంఘాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మీ అందరి మద్దతు చూస్తే రేపు జరగబోయే ఎన్నికల్లో 30 వేల మెజారిటీతో గెలిపిస్తారని నమ్మకం వచ్చిందన్నారు. పేద, బీద, మైనార్టీల గొంతుక కాంగ్రెస్ పార్టీ అని, ఎల్లప్పుడూ వారి సంక్షేమం కోరే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమే బీద ప్రజల సౌకర్యమని చెప్పారు.

ఆయన ఇంకా ఏమన్నారంటే..
- ఇదే హైదరాబాదులో వారానికి ఒకసారి మంచి నీళ్లు వస్తే ఆడవాళ్లు రోడ్లు ఎక్కేవారని 2003-04 లో మంచి నీళ్ల కోసం PJR పోరాటం చేసి ప్రజలకు నీళ్లను అందించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ కాదా?
- ఆనాడు పల్లెను వదిలి బతుకు దేరువుకు పట్నం వస్తే లక్షలది మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ లోన ఉన్న PJRది.
- ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వాస్తదని సొంత చెల్లెని మేడ పట్టి గేంటేసిన దూర్మార్గుడు ktr.
- బిఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. మన ప్రభుత్వం వచ్చాక 14,159 రేషన్ కార్డులు ఒక్క జూబ్లీహిల్స్ లోనే ఇవ్వడం జరిగింది. అలాగే 200 యూనిట్ల కరెంటు.. సన్న బియ్యం.. ఫ్రీ బస్సు ఇచ్చి.. ప్రజా పాలన ను నడిపిస్తుంటే.. బిల్లా రంగాలుగా జూబ్లీహిల్స్ లో ఆటోలో ktr, హరీష్ రావు తిరుగుతున్నారు..
- నా తమ్ముడు నవీన్ యాదవ్ ను మీరందరు ఈ ఉప ఎన్నికల్లో గెలిపించాక ఈ ప్రాంత ప్రజలకు 4 వేల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే బాధ్యత నాది.
- ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, అజారుద్దీన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, MLC బల్మూరి వెంకట్, C.N.రెడ్డి, AIMIM రాష్ట్ర నాయకులు, MLCలు, NSUI నాయకులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

