కరీంనగర్: బోయిన్‌పల్లి మండలం విలాసాగర్ ఉన్నత పాఠశాలలో మంగళవారం పి.హెచ్.సి. డాక్టర్ దివ్య, ఎం.ఎల్.హెచ్.పి, డాక్టర్ శిరీష ఆధ్వర్యంలో పిల్లలందరికీ ఆరోగ్య పరీక్షలు (Health Tests) నిర్వహించి మందులను (Medicines) పంపిణీ చేశారు. పిల్లలకు ఎనీమియా(Anemia), ఓరల్ హెల్త్ (Oral Health), హ్యాండ్ వాష్ (Hand Wash) టెక్నిక్స్, ఆరోగ్య సూచనలు, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెడ్‌మాస్టర్ వి.శ్రీనివాస్, హెల్త్ సూపర్‌వైజర్స్ శశికళ, కృప, ఆరోగ్య కార్యకర్త సునీత, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
