Friday, November 14, 2025
ePaper
Homeస్పోర్ట్స్Kabaddi | రాష్ట్ర, జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు

Kabaddi | రాష్ట్ర, జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు

కొత్తగూడెం: పినపాక మండలం ఏడూళ్ల బయ్యారంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ నెల 8, 9, 10 తేదీల్లో రాష్ట్ర స్థాయి (State Level) బాలబాలికల (Boys and Girls) అండర్ 17 (Under 17) కబడ్డీ (Kabaddi) పోటీలు జరగనున్నాయి. 2026 జనవరిలో జాతీయ స్థాయి (National Level) బాలుర కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు (Arrangements) పకడ్బందీగా చేయాలని కలెక్టర్ జితేషా వి పాటిల్ (Collector Jitesha V Patil) ఆదేశించారు. ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించారు. పోటీల నిర్వహణకు చేపడుతున్న ప్రాంగణ నిర్మాణం, కోర్టుల స్థలాలు, వసతి, భద్రతా చర్యలు, మౌలిక సదుపాయాలను చూసి పలు సూచనలు చేశారు.

రాష్ట్ర స్థాయిలో జరగబోయే ఈ కబడ్డీ పోటీలు భవిష్యత్తులో జాతీయ స్థాయి పోటీలకు వేదికగా మారబోతున్నాయన్నారు. జిల్లా ప్రతిష్టకు తగ్గట్టుగా ఈ కార్యక్రమాలు అత్యుత్తమ ప్రమాణాలతో నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. కబడ్డీ పోటీల నిర్వహణకు మొత్తం 4 కోర్టులను ఏర్పాటుచేయాలని, వీక్షకుల రాకపోకలకు ఆటంకం కలగకుండా ట్రాఫిక్ కంట్రోల్ చేయాలని ఆదేశించారు. పాఠశాల ప్రహరీని తాత్కాలికంగా తొలగించి పక్కనే ఉన్న అటవీ శాఖ నర్సరీ ప్రదేశాన్ని వాడుకోవాలని చెప్పారు. తద్వారా అదనపు స్థలం అందుబాటులోకి వస్తుందని, పోటీలను సౌకర్యవంతంగా నిర్వహించగలమని అన్నారు. అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ వెంకటేశ్వర్లు, విద్యుత్ శాఖ ఏఈ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News