Monday, June 1, 2026
Homeస్పోర్ట్స్Victory | ఫతే మైదాన్ క్లబ్‌కు ఘన విజయం..

Victory | ఫతే మైదాన్ క్లబ్‌కు ఘన విజయం..

  • ‘న్యూ క్లబ్’ పై 3-0తో క్లీన్‌స్వీప్!

స్థానిక స్నూకర్/బిలియర్డ్స్ టోర్నమెంట్‌లో ఫతే మైదాన్ క్లబ్ ‘ఎ’ జట్టు అద్భుత ప్రదర్శనతో దూసుకుపోయింది. హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో న్యూ క్లబ్‌పై 3-0 తేడాతో ఘన విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ టోర్నమెంట్‌లో వన్-సైడెడ్ గేమ్‌తో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఫతే మైదాన్ క్లబ్ ఆటగాళ్లు టేబుల్‌పై తమ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు.

మ్యాచ్‌ల స్కోరు వివరాలు :

- Advertisement -

అజయ్ (ఎఫ్.ఎం.సి.) వర్సెస్ అర్జున్ (న్యూ క్లబ్) :
తొలి మ్యాచ్‌లో ఎఫ్.ఎం.సి. ఆటగాడు అజయ్ 75-26, 38-67, 85-23, 78-30 (3-1) తేడాతో న్యూ క్లబ్ ప్లేయర్ అర్జున్‌పై ఘన విజయం సాధించి జట్టుకు శుభారంభాన్ని ఇచ్చారు.

విశాల్ (ఎఫ్.ఎం.సి.) వర్సెస్ విభస్ (న్యూ క్లబ్) :
రెండో మ్యాచ్‌లో విశాల్ సైతం అదే జోరును కొనసాగించారు. విభస్‌తో జరిగిన ఈ పోరులో 79-33, 57-42, 57-63, 89-0 (3-1) స్కోరుతో విజయం సాధించారు. ముఖ్యంగా నాలుగో ఫ్రేమ్‌లో ప్రత్యర్థికి ఒక్క పాయింట్ కూడా ఇవ్వకుండా 89-0తో క్లీన్‌స్వీప్ చేయడం విశేషం.

నితేష్ (ఎఫ్.ఎం.సి.) వర్సెస్ ప్రవీణ్ (న్యూ క్లబ్) :
మూడో మ్యాచ్‌లో నితేష్ పూర్తిగా విజృంభించి 69-36, 72-38, 21-13 స్కోరుతో ప్రవీణ్‌ను చేతులెత్తేసేలా చేసి జట్టు విజయాన్ని ఖరారు చేశారు.

విశాల్ సరికొత్త రికార్డు! :
ఈ టోర్నమెంట్‌లో ఫతే మైదాన్ క్లబ్ ఆటగాడు విశాల్ బెస్ట్ బ్రేక్ (85 పాయింట్లు) సాధించి, ఈ టోర్నమెంట్‌లోనే ‘హైయెస్ట్ బ్రేక్ స్కోరర్’గా సరికొత్త రికార్డు సృష్టించారు.

ఘనంగా బహుమతుల ప్రధానోత్సవం :
విజేతగా నిలిచిన ఫతే మైదాన్ క్లబ్ (ఎఫ్.ఎం.సి.) జట్టుకు హెచ్.ఎస్.సి. ఛైర్మన్ శేష్ నారాయణ, స్పోర్ట్స్ కమిటీ ఛైర్మన్ వెంకట్ ప్రసాద్ రెడ్డి, కమిటీ సభ్యులు విజయ్ రాజ్, సునీతా రెడ్డి, హేమంత్ ఫాడ్కే, బిలియర్డ్స్ సెక్రటరీ సుబోధ్ మోదీ చేతుల మీదుగా అత్యంత వైభవంగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News