- భరోసా ఇచ్చిన భారత క్రికెట్ నియంత్రణ మండలి..
ఐపీఎల్ 19వ సీజన్‌లో చితక్కొట్టిన వైభవ్ సూర్యవంశీ భవితవ్యం ఏంటీ?.. ఇప్పుడు దేశవ్యాప్తంగా అభిమానుల్లో ఇదే చర్చ. 15 ఏళ్లకే సంచలన ఆటతో దిగ్గజాలను ఆశ్చర్యపరుస్తున్న వైభవ్‌ను త్వరలోనే సీనియర్ జట్టుకు ఆడించాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కుర్రాడిని మరింత రాటుదేల్చడంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి దృష్టి సారిస్తోంది. రెండోసారి విజేత ఆర్సీబీ జట్టుకు ట్రోఫీ బహకరణ అనంతరం కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ వైభవ్ భవితకు పూచీ మాది అని చెప్పాడు.
ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్‌లో రికార్డుల మోత మోగించిన వైభవ్ సూర్యవంశీ పలు అవార్డులు పట్టేశాడు. ఏకంగా ఐదు పురస్కారాలతో అంతర్జాతీయ క్రికెట్‌కు ‘నేను రెఢీ’ అనే సంకేతాలిచ్చాడీ కుర్రాడు. భారత దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, రవి శాస్త్రి, సునీల్ గవాస్కర్‌లు వైభవ్‌ను జాతీయ జట్టులోకి తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తం చేయగా.. బీసీసీఐ సైతం ఆ దిశగా ఆలోచిస్తోంది.
