ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ రకాల ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కేసులలో పట్టుబడిన (116) వాహనాలు పోలీసుల ఆధీనంలోనే ఉన్నాయని, వాటికి సంబంధించిన పత్రాలను చూపించి పెండింగ్ చలనాలు చెల్లించి తీసుకువెళ్లాలని ఎల్బీనగర్ ట్రాఫిక్ ఎస్ హెచ్ ఓ వెంకటేశ్వర్లు తెలిపారు. అవి పట్టుబడినప్పటి నుండి ఇప్పటివరకు, ఆ వాహనాల యజమానులు వాటి మీద చలానాల రూపంలో ఉన్న జరిమానాలను చెల్లించి తీసుకొని పోలేదని, సదరు వాహన యజమానులకు ఇప్పటివరకు పోస్ట్ ద్వారా నోటీసులు ఇవ్వడంతో పాటు సమాచారం కూడా ఇవ్వడం జరిగిందని ఎల్బీనగర్ ట్రాఫిక్ సిఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
అయినప్పటికీ ఇప్పటివరకు ఏ ఒక్కరూ ముందుకు వచ్చి పైన తెలుపబడిన వారి వాహనాలను తీసుకుపోవుటకు రాలేకపోయినందున, చివరి ప్రయత్నం గా ప్రింట్, ఎలక్ట్రాన్రిక్, సోషల్ మీడియా ద్వారా తెలియ చేస్తున్నామని ఇన్స్పెక్టర్ అన్నారు. వాటి యొక్క యజమానులు స్టేషన్ కి వచ్చి వారి వాహనాలకు సంభంచిన సరైన పత్రాలు చూపించి, వాటిపై పెండింగ్లో ఉన్న జరిమానాలను చెల్లించి తీసుకెళ్లగలరని సూచించారు. లేని పక్షంలో చట్ట ప్రకారం నిబంధనల మేరకు వేలం వేయడం జరుగుతుందని, సదరు వాహన యజమానులకు తెలియపరుస్తున్నామని మీడియా సమావేశంలో తెలిపారు.
ఇతరత్రా సమాచారం కోసం 8712662773 సంప్రదించగలరని సి ఐ వెంకటేశ్వర్లు సూచించారు.
