- ప్రత్యేక సమగ్ర ఓటర్ల జబితా సవరణలో మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలన్న జిల్లా కలెక్టర్ : సి నారాయణ రెడ్డి !!
కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీవోలు, అన్ని మండలాల తహసిల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎన్నికల విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ కేంద్రాల బూత్ స్థాయి అధికారులు 2002 ఓటర్ల జాబితాలో ఎన్నికల మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
బి ఎల్ ఓలు ప్రతి ఇంటికి వెళ్లి 18 సంవత్సరాల వయసు పైబడిన వారి వివరాలు సేకరించాలని, నిబంధనల ప్రకారం మ్యాపింగ్ తో పాటు డూప్లికేట్ ఓటర్లు, మరణించిన ఓటర్ల వివరాలను గుర్తించి ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి పరిశీలించి వివరాలను ధ్రువీకరించి తొలగించాలని/ సవరించాలని తెలిపారు. ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం పై ప్రజలలో అవగాహన కల్పించాలని ఓటర్లను చైతన్యపరచాలని తెలిపారు. జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని అధికారులు సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు కే శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, సిపియు సౌమ్య, సంక్షేమ శాఖ అధికారులు రామేశ్వరి దేవి పద్మావతి, ఆర్డీవోలు, ఎమ్మార్వోలు, మున్సిపల్ కమిషనర్లు, విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.
