Sunday, April 26, 2026
Homeఆదిలాబాద్Chalivendram | బెల్లంపల్లి పోలీసుల ఆధ్వర్యంలో చలివేంద్రం

Chalivendram | బెల్లంపల్లి పోలీసుల ఆధ్వర్యంలో చలివేంద్రం

బెల్లంపల్లిలో వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పోలీసుల ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. బెల్లంపల్లి కాల్ టెక్స్ ఫ్లైఓవర్‌పై ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని మంచిర్యాల డీసీపీ భాస్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ, ఎండ తీవ్రతలో ప్రయాణించే ప్రజలు, కార్మికులు, వాహనదారులు దాహార్తిని తీర్చుకునేందుకు ఈ చలివేంద్రం ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కూడా పోలీసుల బాధ్యతేనని పేర్కొన్నారు. వేసవి కాలంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత అవసరమని, ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి సహకరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పోలీసులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News