Homeస్పోర్ట్స్Ajinkya | కొత్తజీవితం మొదలెట్టిన అజింక్యా..

Ajinkya | కొత్తజీవితం మొదలెట్టిన అజింక్యా..

  • యూరోపియన్ టి 20 ప్రీమియర్ లీగ్ లోకి అడుగు..

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజింక్యా రహానే తన కెరీర్‌లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వెంటనే, యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ లో అడుగుపెట్టాడు. ఈ లీగ్ తొలి ఎడిషన్ కోసం అమ్‌స్టర్‌డామ్‌ ఫ్లేమ్స్ ఫ్రాంచైజీకి కీలక ఆటగాడిగా రహానే సంతకం చేశాడు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ యాజమాన్యం నేడు అధికారికంగా వెల్లడించింది. సీసీ ఆమోదం పొందిన యూరప్‌లోని మొట్టమొదటి టీ20 లీగ్ ఇదే కావడం విశేషం. ఈ లీగ్ తొలి సీజన్ ఈ నెల‌ 26 నుంచి సెప్టెంబర్ 20 వరకు జరగనుంది. ఇందులో గ్లాస్గో, అమ్‌స్టర్‌డామ్‌, ఎడిన్‌బర్గ్, డబ్లిన్, బెల్ఫాస్ట్, రోటర్‌డామ్‌ నగరాలకు చెందిన ఆరు ఫ్రాంచైజీలు పోటీ పడనున్నాయి.

భారత్ తరఫున 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20 మ్యాచ్‌లు ఆడిన రహానేకు అపారమైన అనుభవం ఉంది. ఐపీఎల్‌లో 212 మ్యాచ్‌లు ఆడి, ఇటీవలి సీజన్లలో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు నాయకత్వం వహించాడు. రహానే చేరికపై అమ్‌స్టర్‌డామ్‌ ఫ్లేమ్స్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ వా హర్షం వ్యక్తం చేశాడు. రహానే నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు, వినయం జట్టుకు ఎంతో మేలు చేస్తాయని అన్నాడు. యూరప్‌లో క్రికెట్ అభివృద్ధికి తన వంతు సహకారం అందించడం, ఒక విజయవంతమైన ఫ్రాంచైజీని నిర్మించడంలో పాలుపంచుకోవడం సంతోషంగా ఉందని రహానే పేర్కొన్నాడు. ఈ కొత్త లీగ్‌కు రహానే వంటి స్టార్ ఆటగాడి రాక మంచి బూస్ట్ ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News