Homeమహబూబ్‌నగర్‌Negligence | మురికి కూపంగా మారిన మిషన్ భగీరథ మ్యాన్‌హోల్

Negligence | మురికి కూపంగా మారిన మిషన్ భగీరథ మ్యాన్‌హోల్

  • పట్టించుకోని అధికారులు

మహబూబ్‌నగర్ నగరంలో మిషన్ భగీరథకు చెందిన మ్యాన్‌హోల్ మురికి కూపంగా మారి ప్రజారోగ్యానికి ప్రమాదంగా మారింది. నగరంలోని స్విమ్మింగ్ పూల్ సమీపంలోని ఎదురేకు వెళుతున్న ప్రాంతంలో ఉన్న మిషన్ భగీరథ మ్యాన్‌హోల్ పూర్తిగా చెత్తతో నిండిపోయి మురుగు నీటితో దుర్వాసన వెదజల్లుతోంది. చుట్టుపక్కల ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త కుప్పలు పేరుకుపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. మ్యాన్‌హోల్ మూత సరిగా లేకపోవడం, శుభ్రపరిచే పనులు చేయకపోవడం వల్ల అక్కడ నీరు నిల్వ ఉండి దోమల పెరుగుదలకు కారణమవుతోంది.

స్థానికులు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ కార్పొరేషన్ సిబ్బంది స్పందించకపోవడంతో సమస్య అలాగే కొనసాగుతోంది. ఈ నిర్లక్ష్యం వల్ల డెంగీ, మలేరియా వంటి వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వెంటనే ఈ మ్యాన్‌హోల్‌ను శుభ్రపరచి, చెత్త తొలగించి, శాశ్వత పరిష్కారం చూపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Mahabubnagar Manhole Sanitation Negligence Issue1
- Advertisement -
RELATED ARTICLES

Latest News