Homeరంగారెడ్డిMunugode MLA | మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ కి వినతి పత్రం.

Munugode MLA | మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ కి వినతి పత్రం.

సంస్థాన్ నారాయణపురం మండలం, కంకణాలగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని 164 సర్వే నెంబర్ లో గతంలో 65 సంవత్సరాల క్రితం గ్రామ రైతులకు కేటాయించిన భూములలో మండల క్రీడాప్రాంగణం ఏర్పాటు చేయాలనుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, రైతులు సాగు చేసుకుంటున్న భూములు లాక్కున్నట్లయితే వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంది అని, ఉపాధి మరియు ఆర్ధికంగా దెబ్బతినే అవకాశం ఉందని గౌరవ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని, కంకణాలగూడెం సర్పంచ్ పాలెం వీరేష్ గౌడ్ ఆధ్వర్యంలో కలిసి వినతిపత్రం ఇచ్చి తెలియజేయడం జరిగింది.

దీనికి గాను ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి మండల క్రీడాప్రాంగణం మరో చోట ఏర్పాటు చేసే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు సంపతి సుధాకర్ రెడ్డి, సామ పవన్ రెడ్డి, ఎలిమినేటి లింగారెడ్డి, సంపతి శివా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News