Tuesday, November 11, 2025
ePaper
Homeకరీంనగర్సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సౌలభ్యం కోసం 'జీవన్ ప్రమాణ్' శిబిరం

సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సౌలభ్యం కోసం ‘జీవన్ ప్రమాణ్’ శిబిరం

  • పోచారం మున్సిపాలిటీలో ఫేస్ అథెంటికేషన్ ద్వారా లైఫ్ సర్టిఫికెట్ల సమర్పణ

మేడ్చల్ జిల్లా,పోచారం మున్సిపాలిటీలోని సుప్రభాత్ టౌన్‌షిప్ కమ్యూనిటీ హాల్‌లో సోమవారం సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశ్రాంత ఉద్యోగుల కోసం సోమవారం ప్రత్యేక శిబిరం నిర్వహించారు.సింగరేణి విశ్రాంత ఉద్యోగులు తమ పెన్షన్,సీపీఆర్‌ఎంఎస్ మెడికల్ కార్డు రెన్యూవల్ కోసం తప్పనిసరిగా సమర్పించాల్సిన జీవన్ ప్రమాణ్ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌లను సమర్పించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ శిబిరంలో రిటైర్డ్ ఉద్యోగులు,వారి జీవిత భాగస్వాములు “ఫేస్ అథెంటికేషన్” (ముఖ గుర్తింపు) ద్వారా కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ (సీఎం పిఎఫ్),సింగరేణి సంస్థకు తమ లైఫ్ సర్టిఫికెట్‌లను సమర్పించారు.ఈ సందర్భంగా అసోసియేషన్ ఉప ప్రధాన కార్యదర్శి ఆళవందార్ వేణు మాధవ్ మాట్లాడుతూ..

సింగరేణి బొగ్గు గనులకు దూరంగా హైదరాబాద్,మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలలో నివసిస్తున్న రిటైర్డ్ ఉద్యోగుల సౌలభ్యం కోసమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇంటర్నెట్ సెంటర్లలో రద్దీ,అలాగే ‘జీవన్ ప్రమాణ్’ వెబ్‌సైట్‌లో పొరపాటున సంస్థ పేరు ఎంపిక చేయడం వలన పెన్షన్ ఆగిపోయే ప్రమాదం వంటి ఇబ్బందులను గుర్తించి,వాటిని నివారించేందుకు ఈ చర్య తీసుకున్నామని ఆయన వివరించారు.


దాదాపు 60 మంది సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు, వారి జీవిత భాగస్వాములు ఈ శిబిరంలో పాల్గొని సద్వినియోగం చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఉప ప్రధాన కార్యదర్శి ఆళవందార్ వేణు మాధవ్ తో పాటు ఉపాధ్యక్షులు బంగారి రాజయ్య,సుద్దాల లక్ష్మీ నారాయణ,రాజ నర్సు,ప్రభాకర్,సత్యనారాయణ, టి.రాజ్ కుమార్,చుక్కల నర్సయ్య,కొట్టే మల్లయ్య, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News