Friday, November 14, 2025
ePaper
Homeఆరోగ్యంWalking | వాకింగ్ వల్ల లాభాలు

Walking | వాకింగ్ వల్ల లాభాలు

వాకింగ్ చేయటం వల్ల శారీరక సామర్థ్యం(Physical ability) పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి (Immunity) కూడా వృద్ధి చెందుతుంది. దీంతో.. రోగాల (Diseases) బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. నడక వల్ల గుండె (Heart) బాగా పనిచేస్తుంది. హార్ట్ ఎటాక్ (Heart Attack) లాంటి వాటి నుంచి తప్పించుకోవచ్చు. రక్త ప్రసరణ (Blood Circulation) మెరుగుపడుతుంది. వాకింగ్ వల్ల చెమట పోస్తే ఆ చెమట ద్వారా రక్తంలోని వ్యర్థాలు బయటకుపోతాయి. బీపీ కంట్రోల్‌లో ఉంటుంది. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. బ్లడ్ షుగర్ లెవల్ తగ్గుతుంది. ఒళ్లు బరువు తగ్గుతుంది. మెంటల్ స్ట్రెస్, ఆదుర్దా, ప్రెజర్ అదుపులో ఉంటాయి. నిద్ర బాగా వస్తుంది. కొన్ని క్యాన్సర్ల ముప్పు తొలిగిపోతుంది. కీళ్లు, ఎముకలు బలపడతాయి. నీరసం, అలసట, నిస్సత్తువ ఉండవు. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. కొత్త ఫ్రెండ్స్ ఏర్పడతారు. హుషారుగా ఉంటారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News