Homeవరంగల్‌Venkatapuram | బిజెపి ఆధ్వర్యంలో వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు…

Venkatapuram | బిజెపి ఆధ్వర్యంలో వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు…

వెంకటాపురం: భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారత ప్రధానినరేంద్ర మోడీ జన్మదిన వేడుకల్లో భాగంగా సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం వెంకటాపురం మండల(Venkatapuram Mandal) కేంద్రంలో గల శ్రీ విశ్వ జ్యోతి స్కూల్ నందు మండల అధ్యక్షుడు రామేళ్ల రాజశేఖర్ ఆధ్వర్యంలో చిత్రలేఖనం మరియు వ్యాసరచనం పోటీలు నిర్వహించారు. తదనంతరం ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిగతా పిల్లలందరికీ ఒక చిన్న కానుకగా బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ నెంబర్ బొల్లె సునీల్, మండల సీనియర్ నాయకులు జల్లిగంపల లక్ష్మీపతి, మండల ప్రధాన కార్యదర్శి నోముల శ్రీ కిషన్, మండల ఉపాధ్యక్షులు తోట సతీష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. (https://epaper.aadabhyderabad.in/), (Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News