Homeనిజామాబాద్‌Tadwai | గణేష్ నిమజ్జన ఉత్సవాలలో తాడ్వాయి రూటే సపరేటు.

Tadwai | గణేష్ నిమజ్జన ఉత్సవాలలో తాడ్వాయి రూటే సపరేటు.

  • తగ్గేదే లే అంటున్న యువత.. బొజ్జ గణపయ్యకు ఘనంగా వీడ్కోలు ..!
  • తాడ్వాయిలో అంబరాన్ని అంటిన గణేశ్ నిమజ్జన సంబరాలు
  • విల్లువిరిసిన భక్తి.. డప్పుల దరువుతో దద్దరిల్లిన వీధులు !
  • కాంతుల జిలుగులు.. డప్పుల మోతలతో దద్దరిల్లిన తాడ్వాయి .
  • తాడ్వాయిలో కన్నులపండువగా వినాయక నిమజ్జనోత్సవం.

తాడ్వాయి: కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో వినాయక నిమజ్జన సంబరాలు అంబరాన్ని అంటాయి. జిల్లాలోనే తాడ్వాయి(Tadwai) నిమజ్జనోత్సవానికి ప్రత్యేక గుర్తింపు ఉండటంతో, యువత ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించింది. పోలీసుల నిబంధనల మేరకు డీజేలను పక్కన పెట్టినా.. ఏమాత్రం ఉత్సాహం తగ్గకుండా ప్రత్యామ్నాయంగా భారీ లైటింగ్ సెట్టింగులు, ప్రత్యేక డప్పులు, బ్యాండ్ బాజాలతో తాడ్వాయి పురవీధులను మారుమోగించారు. లక్షలాది రూపాయలు వెచ్చించి ప్రతి యూత్ అసోసియేషన్ పోటాపోటీగా నిమజ్జన ఏర్పాట్లను ఘనంగా చేపట్టింది.

తొమ్మిది రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు అందుకున్న లంబోదరుడికి, “వెళ్లిరా గణపయ్యా.. మళ్ళీ ఏడు త్వరగా రారయ్యా” అంటూ భక్తులు వీడ్కోలు పలికారు. కళ్లు చెదిరే లైటింగ్ డెకరేషన్లు, వినూత్న రీతిలో సాగే డప్పు వాయిద్యాలతో నిమజ్జనం నిర్వహించడం తాడ్వాయిలో(Tadwai) ఏటా వస్తున్న ఆనవాయితీ. ఇక్కడి యువతలోని ఐక్యమత్యం, స్నేహభావమే ఈ ఉత్సవాల విజయానికి ప్రధాన బలం. అనుకున్న రీతిలో ఉత్సవాలు జరపడానికి ఎంతటి శ్రమకైనా, వ్యయప్రయాసలకైనా వెనుకాడకపోవడం తాడ్వాయి యువత ప్రత్యేకత.

- Advertisement -

ఈ అద్భుత నిమజ్జన శోభను తిలకించడానికి జిల్లా కేంద్రమైన కామారెడ్డితో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దారులన్నీ కిక్కిరిసిపోవడంతో మండల కేంద్రం జనసంద్రంగా మారింది. ఈ ఉత్సాహాన్ని చూసిన భక్తులు, సందర్శకులు “నిజంగానే వినాయక ఉత్సవాల్లో తాడ్వాయి రూటే సపరేటు” అంటూ ప్రశంసలు కురిపించారు.

For More Info (https://epaper.aadabhyderabad.in/), (Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News