Homeవరంగల్‌Adivasi Land Protection | 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి..

Adivasi Land Protection | 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి..

  • ఆదివాసీ భూములకు రక్షణ కల్పించాలి…(Adivasi Land Protection)
  • ఆదివాసి సంఘాల ఐక్య కార్య చరణ కమిటీ…

వెంకటాపురం: ములుగు జిల్లా వెంకటాపురం మండలం బర్లగూడెం (గ్రామపంచాయతీ) పర్షికగూడెం గ్రామంలో పర్యటిస్తూ అక్టోబర్5వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ముట్టడి మహాధర్నాను విజయవంతం చేయుటకు గొండ్వాన సంక్షేమ పరిషత్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూనెం సాయి, ఆదివాసి నవనిర్మాణ సేన వెంకటాపురం మండల అధ్యక్షుడు వాసం నారాయణ ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…

- Advertisement -

ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీల భూములకు రక్షణ కల్పించేందుకు అమల్లో ఉన్న 1/70 భూ బదలాయింపు నిబంధనలను ప్రభుత్వం పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. షెడ్యూల్డ్ ప్రాంతంలో 1/70 నిబంధనల ఉద్దేశం ఆదివాసీల భూములు చట్టవిరుద్ధంగా గిరిజనేతరుల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడటమే అన్నారు. అయితే అనేక ప్రాంతాల్లో భూముల బదలాయింపులు, ఆక్రమణలు, వివాదాలు కొనసాగుతున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయని విమర్శించారు. దీనిపై ప్రభుత్వం సమగ్రంగా విచారణ చేపట్టి, చట్టవిరుద్ధమైన భూ బదలాయింపులు ఉన్నట్లు తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలనీ కోరారు.

ప్రధాన డిమాండ్లుగా 1. ఏజెన్సీ ప్రాంతాల్లో 1/70 నిబంధనలను కఠినంగా అమలు చేయాలని. 2. ఆదివాసీల భూములపై వచ్చిన ఫిర్యాదులను ప్రత్యేకంగా విచారించాలని, 3. చట్టవిరుద్ధమైన భూ బదలాయింపులు ఉన్నట్లు నిర్ధారణ అయితే, చట్టప్రకారం భూములను తిరిగి హక్కుదారులకు అందించే చర్యలు చేపట్టాలని, 4. పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలను త్వరితగతిన పరిష్కరించాలని, 5. భూ రికార్డులను సమగ్రంగా పరిశీలించి, పారదర్శకంగా నిర్వహించాలని, 6. ఆదివాసీల భూములపై ఆక్రమణలు జరుగుతున్నాయనే ఫిర్యాదులపై రెవెన్యూ, ఐ టి డి ఏ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలన్నారు.

7. 1/70 నిబంధనల అమలులో నిర్లక్ష్యం లేదా అవకతవకలు జరిగినట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, 8. ఆదివాసీలకు వారి భూములపై హక్కులు, అందుబాటులో ఉన్న చట్టపరమైన పరిష్కారాలపై అవగాహన కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి 1/70 చట్టపరమైన రక్షణలను సమర్థవంతంగా అమలు చేయాలని, ఆదివాసీల భూముల రక్షణ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా పారదర్శకమైన చర్యలు చేపట్టాలనీ, 5 అక్టోబర్ 2026 న చలో భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ముట్టడి మహాధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆదివాసి యువతి, యువకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొప్పుల ఆది, మదనయ్య, లక్ష్మి, నాగరాజు, శంకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

    - Advertisement -
    RELATED ARTICLES

    Latest News